Home జనగామ రైలు క్రింద పడి గూడ్స్ గార్డు మృతి…

రైలు క్రింద పడి గూడ్స్ గార్డు మృతి…

Goods guard dead under the train in jangaon
జనగామ: రైలు క్రిందపడి గూడ్స్ గార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జనగామలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం… రఘునాధపల్లి మండలం పత్తెషాపూర్ గ్రామానికి చెందిన చింత నర్సింహా (35) కాజీపేటలో గూడ్స్ రైల్వే గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. తన మేనత్త భర్త దశదినకర్మకు బుధవారం పెద్దపహడ్ గ్రామానికి వెళ్ళాడు. బుధవారం పెద్దపహాడ్‌లో జరిగిన తన మేనత్త భర్త దశదినకర్మకు తన భార్యను రమ్మని అడుగగా ఆమే రానని చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు కలిగి మనస్థాపంతో ఆదే రాత్రి జనగామ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి 3 గంటల వరకు వేచి ఉండి తన భార్యకు పోన్ ద్వారా నేను పోతున్నాను నీవు ఒక్కదానివే మంచిగా ఉండు అని చెప్పి కాజిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే గౌతమీ ఎక్స్‌ప్రెస్ క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య శ్యామల, కూతురు శార్వానిలు ఉన్నారు. కాజీపేట్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆరుణ కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.