Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కేరళకు గూగుల్ 7 కోట్ల సాయం…

Google has helped 7 crores to Kerala

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి గూగుల్ ముందుకొచ్చింది. ఆ సంస్థ తరపున మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) విరాళంగా ఇవ్వనున్నట్టు గూగుల్‌కు చెందిన సీనియర్ అధికారి మంగళవారం వెల్లడించారు. గూగుల్, ఒఆర్‌జి, గూగులర్స్ కలిసి కేరళ సహాయక చర్యల కోసం మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమానికి హజరైన ఆ సంస్థ ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే కేరళలో పర్సన్ ఫైండర్ టూల్‌ను యాక్టివేట్ చేసింది గూగుల్. దీనిద్వారా 22 వేల మంది సమాచారం చేరింది. 2 నెలలుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో కేరళలో 417 మంది చనిపోగా…. 8 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా కేరళ రాష్ట్రానికి సుమారు 20 వేల కోట్ల నష్టం జరిగింది.

Comments

comments