Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

గూగుల్ నెక్సస్ ఫోన్లు అమ్మకాలు వచ్చేశాయ్!

Nexus-5Xన్యూఢిల్లీ : ఎల్‌జీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ‘గూగుల్ నెక్సస్ 5ఎక్స్’ ఫోన్ అమ్మకాలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని వారు వెల్లడించారు. క్రోమా, సంగీతా తదితర మొబైల్ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్లు లభ్యమవుతాయి. 16జిబి ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంగల నెక్సస్ 5ఎక్స్ ధర రూ.31,900, 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల గూగుల్ నెక్సస్ 5ఎక్స్ ఫోన్ ధర రూ.35,900గాను ప్రకటించారు. గూగుల్ ఇండియా ఈనెల 13న నెక్సస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఎల్‌జి, హు వావి కంపెనీ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.31,900గా నిర్ణయించారు. ఈ పండగ సీజన్‌లో సుమారు ఒక లక్ష వరకు నెక్సస్ ఫోన్ల విక్రయం జరుగుతుందని ఎల్‌జి కంపెనీ అంచనా వేస్తోంది.

Comments

comments