Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

తేజ్ యాప్ పేరు మార్చిన గూగుల్ సంస్థ

Google Tez renamed as Google Pay

న్యూఢిల్లీ: దేశంలో గూగుల్ ప్రవేశపెట్టిన తొలి డిజిటల్ పేమెంట్ యాప్ అయిన ‘తేజ్’ గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, గూగుల్‌కు చెందిన యుపిఐ ఆధారిత పేమెంట్ యాప్ తేజ్ పేరును గూగుల్ పేగా మార్చింది ఆ సంస్థ. ఈ బ్రాండ్ పేరు మార్పు వల్ల యూజర్లు రీటెయిల్ స్టోర్స్‌కు పేమెంట్లు చేయడంతోపాటు ఇతర యాప్స్‌లో ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసే అవకాశం ఉంటుంది. తేజ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా 75 కోట్ల ట్రాన్సక్షన్లు జరిగాయని ఆ సంస్థ వెల్లడించింది. వీటి విలువ రూ. 2 లక్షల కోట్లు అని గూగుల్ పేర్కొంది. ప్రతి నెల ఈ యాప్‌ను 2.2 కోట్ల మంది వాడుతున్నారని పేమెంట్స్ అండ్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ ఇనిషియేటివ్ మేనేజర్ సీజర్ సేన్‌గుప్తా తన బ్లాగ్‌పోస్ట్‌లో ద్వారా తెలియజేశారు. గూగుల్ పేను కొత్తగా మరిన్ని యాప్స్, వెబ్‌సైట్స్, బ్రాండెడ్ రీటెయిల్ స్టోర్స్‌లోనూ వాడుకొనే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం గూగుల్ పేను గొఐబిబొ, ఫ్రెష్‌మెను, రెడ్‌బస్‌లాంటి యాప్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇప్పటినుంచి బుక్ మై షోలో కూడా గూగుల్ పేను వాడుకొనే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లాంటి వాటితో ఒప్పందం కుదుర్చుకున్నగూగుల్ పే, తమ వినియోగదారులకు లోన్స్ కూడా ఇవ్వనుంది. గూగుల్ పే ద్వారా సదరు బ్యాంకుల నుంచి సాధ్యమైనంత తక్కువ పేపర్ వర్క్‌తో వినియోగదారులకు లోన్లు పొందే వీలుంటుందని సేన్‌గుప్తా పేర్కొన్నారు.

https://twitter.com/GooglePayIndia/status/1034340562948636672

Comments

comments