Home జాతీయ వార్తలు భువనేశ్వర్ స్టేషన్‌లో గూగుల్ ఉచిత వైఫై సదుపాయం

భువనేశ్వర్ స్టేషన్‌లో గూగుల్ ఉచిత వైఫై సదుపాయం

Google-Free-Wifi-at-Bhuvaneన్యూ ఢిల్లీ: ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు విస్తృతం చేసేందుకు రైల్వే అధికారులు ఒడిషాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా గూగుల్ అందిస్తున్న ఫ్రీ వైఫై సదుపాయం ఏప్రిల్ 17 నుంచి భువనేశ్వర్ స్టేషన్‌లో అందుబాటులోకి రానుంది. గూగుల్ ప్రాజెక్టులో వైఫై అందించనున్న రెండో స్టేషన్ ఇది. భువనేశ్వర్ స్టేషన్‌లో ఫ్రీ వైఫై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ముంబయి సెంట్రల్ రైల్వేస్టేషన్ తర్వాత గూగుల్ ఉచిత వైఫై అందిస్తున్నది ఇక్కడే. 2016 చివరి నాటికి దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే వంద రైల్వే స్టేషన్లలో మెరుగైన ఇంటర్నెట్ సేవలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.