Home తాజా వార్తలు హిందీ – తెలుగులో గోపీచంద్ బయోపిక్

హిందీ – తెలుగులో గోపీచంద్ బయోపిక్

Pullela-Gopichand

ముంబయి : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా హిందీ – తెలుగు భాషల్లో ఓ చిత్రం రానుంది. గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అబండన్టియా ఎంటర్‌టైర్స్‌మెంట్స్ సంయుక్తంగా గోపీచంద్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్టు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలిపారు. 2018 మే నుంచి ఈ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. గరుడవేగతో విజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో సుధీర్‌బాబు టైటిల్ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పివి సింధు, సైనా నెహ్వాల్ బయోపిక్‌లు కూడా రాబోతున్న విషయం తెలిసిందే.

Gopichand Biopic in Hindi and Telugu