Search
Sunday 18 November 2018
  • :
  • :

దొడ్డా క్రిష్ణయ్య ఆశయాలను సాధించాలి : గోరేటి

Goreti-Venkannaమన తెలంగాణ/తల్లాడ: ప్రజల కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన దొడ్డా క్రిష్ణయ్య ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గోరేటి వెంకన్న అన్నారు. మండల పరిధిలోని అన్నారుగూడెం గ్రామంలో శుక్ర వారం రాత్రి దొడ్డా క్రిష్ణయ్య వర్థంతి సభ జరిగింది. ఈ సభకు గోరేటి వెంకన్న ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న దొడ్డా క్రిష్ణయ్యను హత్య చేయడం దుర్మార్గమన్నారు. సమాజంలో హత్యారాజకీయాలను పారద్రోలాలని, ఆధిపత్యంకోసం హత్యా రాజకీయాలను విడనాడాల ని ఆయన స్పష్టం చేశారు. దొడ్డా క్రిష్ణయ్య హత్యగా వింపబడి 23సం వత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజల లో ఆయనకున్న ఆదరణ మరువలేనిదన్నారు. ప్రము ఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం తపించే దొడ్డా క్రిష్ణయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా రన్నారు. ప్రజాజీవన విధానంలో కుట్రపూరిత రాజకీయాలు ఉండ కూడదని, అభివృద్దే ధ్యేయంగా ప్రతి ఒక్క రు పనిచేయాలని ఆయన పిలుపు నిచ్చా రు. సంఘంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా జీవిం చే హక్కు ఉందని, హత్యారాజకీయాలను రూపుమా పాలన్నా రు. అనంతరం గోరేటి వెంకన్న నిర్వహించిన అటపా ట కార్యక్రమం లో సభికులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డా నిర్మల, సిపియం నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, చిన్న శ్రీనివాస రావు, మేడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments