Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రకుల్ ప్రీత్ వాలెట్‌లో మెగా హీరో ఫోటో!?

Rakul-and-Sai-Dharam-Tej

చిత్ర పరిశ్రమల్లో హీరోహీరోయిన్లు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం.. పీటల వరకు వెళ్లి పెళ్లిలు ఆగిపోవడం షరమాములుగా జరుగుతునే ఉంటాయి. హీరోహీరోయిన్ మధ్య ప్రేమంటూ కొన్ని వార్తలు నిజమైతే.. మరికొన్ని గాసిప్స్‌లుగానే మిగిలిపోతాయి. తాజాగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి టాలీవుడ్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రకుల్‌సింగ్‌ల జోడి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీలోని ఓ సాంగ్ షూటింగ్ నిమిత్తం చిత్ర బృందం ఫారిన్‌లో ఉంది. అయితే సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు గోపిచంద్ యాదృచ్చికంగా రకుల్ వాలెట్‌ను చూశాడట. దాంట్లో సాయి ధరమ్ తేజ్ ఫోటో చూసి మలినేని ఆశ్చర్య పోయాడట.

ఈ విషయాన్ని సాయితో చెప్పడం… మెగా మేనల్లుడు విషయాన్ని చిత్ర యూనిట్ సమక్షంలో చర్చించడంతో రకుల్ ఆ ఫోటోకు సంబంధించిన అసలు విషయం చెప్పిందట. కానీ ఈ వార్త ఆ నోట ఈ నోట బయటకు రావడంతో సాయి, రకుల్‌ల మధ్య ఏదో ఉందనే గుసగుసలు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. వీటికి ఎప్పుడు, ఎలా పుల్‌స్టాప్ పడుతుందో వేచిచూడాలి.

Comments

comments