Search
Wednesday 21 November 2018
  • :
  • :

ప్రకృతి వింత!

Gouqi-Iland

చైనాలోని గౌకి దీవికి వెళ్లామంటే ఆశ్చర్యపోక మానం. ఎందుకంటే అక్కడంతా పచ్చదనమే కన్పిస్తుంది. దీనికో చరిత్ర ఉంది. ఆ దీవి వాసులకు చేపలు పట్టడం వృత్తి. పట్టిన చేపల్ని ఆ దీవి నుంచి పట్టణానికి తరలించాలంటే చాలా దూరం వెళ్లాల్సొచ్చేది. దాంతో వ్యాపారం సరిగ్గా సాగేది కాదు. అందుకని ఊళ్లోని వారంతా నెమ్మదిగా మరోచోటికి వలస వెళ్లారు. ఆ గ్రామంలో ఒక్కరు కూడా లేరు. కొంతకాలం గడిచాక ఎవరో వెళ్లి చూసేసరికి ఈ ఊరు రూపురేఖలే మారిపోయి ఉంది. ఇదేంటి ఊరంతా ఖాళీ అయితే, శిథిలమైపోవాలి కదా! ఇక్కడ మాత్రం పచ్చదనం పరవశింపజేస్తోంది. మట్టి దారిలో కొంత కాలం ఎవరూ నడవకపోయేసరికి గడ్డి మొక్కలు మొలిచాయి.  గౌకీ దీవిలో జనం లేకపోయే సరికి స్థానికంగా విస్తృతంగా పెరిగే ఒక రకం తీగమొక్కలు ఈ ఊరిలోని ఇళ్లు, రోడ్డు, మెట్ల దారులన్నింటినీ కప్పేసింది. దీంతో ఊరికి కొత్త కళ వచ్చేసింది. ఇప్పుడిది పర్యాటకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

Comments

comments