Search
Thursday 15 November 2018
  • :
  • :

12న వస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

balaiahనందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు శాతకర్ణి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. చిరంతన్‌భట్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులను ఎంతగా నో అలరిస్తున్నాయి. ఇక చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల తేదీని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించా రు.  చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “బాలయ్య వందో సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని నిర్మించడం ఆనందంగా ఉంది. మొరాకో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ చూపిన తెగువ, ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ సుప్రసిద్ధ నటి హేమామాలినీలు పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకు ఆయువుపట్టు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా రూపొందించారు. తెలుగువాడైన శాతకర్ణి ఘన కీర్తిని ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12న విడుదల చేయబోతున్నాం”అని అన్నారు.  శ్రియాశరణ్, కబీర్ బేడీలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, పోరాటాలు: రామ్-లక్ష్మణ్.

Comments

comments