Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దూసుకువస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

balaiahస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ- దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బాలయ్య 100వ చిత్రంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ మూవీ ఈనెల 12న రిలీజ్‌కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. భారతదేశాన్ని అంతటినీ పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితంపై తెరకెక్కిన చిత్రమిది. మహారాజు పాత్రలో బాలకృష్ణ ఎంతో హుందాగా నటించిన ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాణి వశిష్టి దేవి పాత్రలో శ్రియాశరణ్ నటించగా… రాజమాత గౌతమి బాలశ్రీ పాత్రను  హేమామాలిని పోషించింది.  మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 2 గంటల 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కబీర్ బేడి ఓ ముఖ్య పాత్రలో నటించారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ అద్భుతమైన కెమెరా పనితం అందరినీ ఆకట్టుకుంటోంది.  వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Comments

comments