Search
Tuesday 17 July 2018
  • :
  • :

ప్రభుత్వ పాఠశాలే కాంట్రాక్టర్లకు అడ్డా..

Goverment Provided Crores Of money for Devlopment Schools

వెంకటాపూర్: ప్రభుత్వ పాఠశాలే కాంట్రాక్టర్లకు అడ్డాగా మారింది. మండలంలోని అడవి రంగాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని మల్లయ్యపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో ఉన్నటు వంటి ప్రభుత్వ పాఠశాల మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతరాం నాయక్  పుట్టిన ఊరు ఈ ఊరిలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల నడిపించినప్పటికి గత రెండు సంవత్సరాల నుండి పాఠశాల మూత పడటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల ఖర్చుతో గ్రామం నుండి చెల్పూరు వరకు డబుల్ రోడ్డు పనులు చేపట్టినప్పటికి సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం ప్రభుత్వ పాఠశాలనే అడ్డాగా ఏర్పాటు చేసుకుని పాఠశాల ఆవరణలో సిమెంట్ బస్తాలు, సంబంధిత పరికరాలు వాహనాలు నింపుటకు పనులు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామాల్లో ఉండే పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు సన్న బియ్యం, ప్రతిరోజు గుడ్లు,మంచి విద్యను అందించి రాబోయే భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కోట్ల నిధులు ఇచ్చినప్పటికి ఎంపి గారైన స్వంత గ్రామంలో స్కూల్ ఉన్నప్పటికి విద్యార్థులు లేకపోవడం వలన స్కూల్ మూతబడి ఉంది. ఇదే ఆసరగా తీసుకున్న కాంట్రాక్టర్ మాత్రం మూత పడ్డ స్కూల్ లో కాంట్రాక్టు పనులు చేపడుతూ సిమెంట్ బస్తాలు, సంబంధిత పరికరాలు స్కూల్ ఆవరణం ముందు వాహనాలను నిలుపుతూ  రోడ్డు పనులను చేపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూతబడ్డ స్కూల్ లను తెరిపించి గ్రామాలలో ఉండే విద్యార్థులకు బోధన చెప్పి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగాలని కోట్ల ఖర్చు పెట్టినప్పటికి సంబంధిత అధికారులు మాత్రం ప్రభుత్వం చెప్పిన నిబంధనలను తుంగలో తొక్కి స్కూల్ లను మూత వేశారు. గ్రామాల అభివృద్ది కొరకు లక్ష్మీందేవిపేట నుండి చెల్పూరు వరకు కోట్ల ఖర్చుతో రోడ్డు పనులు చేపట్టినప్పటికి సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం పాత కల్వర్టుకు ఇప్పుడో మాపో కూలిపోతుందని దానికి కూడా ప్రక్కనే ఇంకో కల్వర్టును ఏర్పాటు చేసి దానిని అలాగే ఉంచడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పటికి కల్వర్టు తొందరగా కూలీపోతుందని గ్రామస్థుల ఆరోపణ. సంబంధిత అధికారులు మాత్రం కాంట్రాక్టర్ ఇచ్చిన మాముళ్ల కు పట్టించుకోవడం వలన పాత కల్వర్టు ప్రక్కనే పనులు చేపడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక  గ్రామం నుండి ఇంకొక గ్రామానికి ప్రయాణం చేసే ప్రయాణికులకు రోడ్డు సౌకర్యాలు సక్రమంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కోట్లతో పనులు చేపట్టినప్పటికి సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం అధికారులను చేతిలో పెట్టుకుని ఇచ్చే మాముళ్ళు ఇస్తు రోడ్డు పనులు నాణ్యత చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి రోడ్డు పనులను పరిశీలించాలని, సంబంధిత కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.

Comments

comments