Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ, ప్రైవేట్ బ‘ఢీ‘

Government and private school

మనతెలంగాణ/కరీంనగర్‌: ఇటీవల రంగస్థలం సినిమాలో ప్రజాదరణ పొంది అందరి నోళ్ళలోనూ నానుతున్న ఆ గట్టునుంటావా నాగన్న…ఈ గట్టు కొస్తావా… అనే పాట ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల మ ధ్య చిచ్చుకు కారణమైంది.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ పూర్వ కరీంనగర్ జిల్లా కొ హెడ మండలం శనిగరం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు లు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే విధం గా రంగస్థలం సినిమాలోని పాటను పేరడిగా వాడుకుం టూ, ఆ పై ఫ్లెక్సీని రూపొందించారు. ఆ గట్టున ప్రైవేట్ పాఠశాలలు, ఈ గట్టున ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటూ రూపొందించిన ఆ పాట, ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చే ర్పించేందుకు ఉపాధ్యాయులు పడుతున్న తపనకు రంగస్థలం సినిమాలోని పాటలు ఆలంబనగా నిలిచాయి. ఆ గట్టునుంటావా..అనే పాటే కాకుండా.. రంగమ్మా.. మంగ మ్మా అనే పాటకు కూడా పేరడీ క్రియోట్ చేసి ప్రభుత్వ పా ఠశాలలో విద్యార్థులను ఆకర్షించేందుకు ఆడియో విడుదల చేశారుప్రభుత్వ ఉపాధ్యాయులు. అయితే అదే ప్రచారం ప్రభుత్వ,ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల మధ్య చి చ్చుకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కంటే తామేం తీసిపోమని భావించారో ఏమో… ప్రైవేట్ యాజమాన్యంలోని ఉపాధ్యాయులు ఏకంగా ఓ విడియో ను రూపొందించి విడుదల చేయడం ప్రకంపనలకు కారణమైంది. ప్రభుత్వగుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం పేరిట విడుదలైన ఈ విడియో పై ప్ర భుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పాఠశాలల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు త లెత్తిన ఈ రాద్దాంతం ఎవరికి ఉపయోగం అన్న విషయా న్ని అటుంచితే విద్యా వ్యవస్థలో తలెత్తిన పోటీ ఎటు మళ్లి ఏ వైపుకు దారితీస్తుందో అని విద్యాభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తమ విడియోలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, శాసన సభ్యులు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల స్థాయి తో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు తమ పాఠశాలలోనే చదువుతున్నారని పేర్కొనడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీ ర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, భోజనంచూసి మోసపోవద్దంటూప్రైవేట్ పాఠశాలలయాజమాన్యాలు పేర్కొనడాన్ని ప్రభుత్వ టీచర్లు తప్పుపడుతున్నారు. ప్రభు త్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న తాము నాణ్యమైన విద్యను అందిస్తున్నామనిప్రైవేట్ యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటూ ఆపై ప్రభుత్వ పాఠశాలలను నిందిస్తూ విడియోలు రూపొ ందించడం సరియైంది కాదని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నా రు.విద్యారంగంలో రెండు యాజమాన్యాల మధ్య జరుగుతున్న కో ల్డ్ వార్ అటుంచితే, గత కొద్ది రోజులుగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్యపొత్తు పొసగడం లేదు. ప్రభుత్వ రంగంలో విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలపై కాస్తాకఠినంగా వ్యవహరించడంతో పాటు ఇబ్బడి, ముబ్బడిగాగురుకులాలు,ఆదర్శ పాఠశాలలు,సక్సెస్ స్కూల్స్ ప్రార ంభిస్తూ వాటిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఇది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మింగుడుపడని పరిణామ ంగా మారింది.ఇటివలే రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రైవేట్ పాఠశాలల వాహనాలు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీసివేయండంటూ ప్రజలకు పిలుపునివ్వడం ప్రభుత్వానికి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి మధ్య జరుగుతున్న వివాదంలో  అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

Comments

comments