Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారదా..?

government doctors negligence thiere duty in rangareddy
ముగ్గురు గర్బిణి స్త్రీలను పట్టించుకొని సిబ్బంది..
గర్బీణి స్త్రీ వెంట వచ్చిన వృద్దురాలే పురుడు పోసిన వైనం..
మరో గర్బీణి స్త్రీని షాద్‌నగర్‌కు తరలింపు..
డ్యూటిలో ఉన్న స్టాప్ నర్స్ కనీసం దగ్గరకు రాలేదంటూ కుటుంబ సభ్యుల ఆవేధన..
 సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబాల డిమాండ్..
మనతెలంగాణ/కొందుర్గుః ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నినాదాన్ని ప్రభుత్వం రూపుమాపేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుంటే సిబ్బంది అందుకు బిన్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల కనీసం జాలి చూపక పోవడంతో ఆసుపత్రికి రాకున్నా మేలుండే అంటూ ఆ కుటుంబాలు కన్నీటి పర్యాంతమౌతున్నారు. పురిటి నొప్పుల బాధతో ఆసుపత్రికి వస్తే విధులు నిర్వహిస్తున్న డ్యూటీ నర్స్ పట్టించుకోలేదని, మరో గర్బిణి స్త్రీకి ఆమే వెంట వచ్చిన వృద్దురాలు పురుడు పోస్తే.. మరో గర్బిణి స్త్రీని ఆలస్యం చేసి ఉన్నతాసుపత్రికి 108లో పంపించారు. మరీ స్థానికంగా ఆసుపత్రి ఉండి ఏం ప్రయోజనం అంటూ పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థరాత్రి వచ్చినా పట్టించుకోలేదు..
జిల్లేడ్ చౌదరిగూడ మండల పరధిలోని ముష్టిపల్లి పంచాయతీలోగల పెద్దమ్మగడ్డ తాండాకు చెందిన కేతావత్ లలిత పురిటి నొప్పులతో బుధవారం 11 గంటలకు ఆసుపత్రికి వస్తే డ్యూటిలో ఉన్న స్టాప్ నర్స్ సలోని వారి వైపు కన్నెత్తి చూడలేదు.. పలు మార్లు దగ్గరకెళ్ళి బ్రతిమిలాడితే ఏం పర్వాలేదు.. నాకు అన్నీ తెలుసు అంటు కాస్తా స్వరం పెంచి గద్దిస్తే చేసేదేమిలేక ఆసుపత్రిలోనే ఆ కుటుంబం కన్నీటి పర్యాంతమైనట్లు పేర్కోంటున్నారు. అంతే కాకుండా కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన చాకలి లావణ్య గురువారం ఉదయం 5 గంటలకు ఆసుపత్రికి వస్తే సిబ్బంది ఎవరు పట్టించుకోక పోవడం మూలంగా ఆమే వెంట వచ్చిన తిరుమలమ్మ అనే వృద్దురాలు పురుడుపోసి తల్లి బిడ్డలను కాపాడింది. లావణ్య మగపిల్లవానికి జన్మనివ్వగా వారు క్షేమంగా ఉన్నారని తిరులమ్మ తెలిపింది. అదే విదంగా వనంపల్లి గ్రామానికి చెందిన బార్ల లలిత పురిటి నొప్పులతో కొందుర్గు ఆసుపత్రికి ఉదయం 7 గంటలకు వస్తే 9 గంటల వరకు కాలయాపన చేసి షాద్‌నగర్ తీసుకెళ్ళాలని 108ను సిద్దం చేసి పంపించినట్లు ఆ కుటుంబ సభ్యులు పేర్కోంటున్నారు.
తీరు మార్చుకొని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది..
కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు విధులు నిర్వహించాల్సిన స్టాప్ నర్స్ సలోని ఆసుపత్రికి వచ్చిన గర్బిణి స్త్రీలను పట్టించుకోలేదని.. ఓ సందర్బంలో కుటుంబ సబ్యులు గర్బిణి స్త్రీని చూడాలని వేడుకోగా అన్నీ నాకు తెలుసు ఏమైనా ఉంటే తినబెట్టి పడుకోండంటూ సలహాలు ఇచ్చిందని ఆ కుటుంబం ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మరో డ్యూటి నర్స్ కళమ్మ వచ్చేంత వరకు విధుల్లో ఉండాల్సిన డ్యూటి నర్స్ సలోని ఆమే రాకుండే వెళ్ళిపోయిందని వారు పేర్కోంట్నునారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సౌకర్యాలు మెరుగు పరిచినా సిబ్బంది మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదని, విధుల పట్ల కనీసం ఉండాల్సిన భయం భక్తి లేకుండా పోయాయంటూ పలువురు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది తీరు మెరుగుపడాలి..
పురిటి నొప్పుల భాదతో ఆసుపత్రికి వచ్చిన తల్లులు పడిన ఆవేధనను చూస్తుంటే ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించడమే తప్ప క్రింది స్థాయి సిబ్బందికి మార్గ నిర్దేశకాలు చేసిన పాపాన పోవడం లేదంటూ పలువురు పేర్కోంటున్నారు. కేసిఆర్ కిట్టు, ఆరోగ్యలక్ష్మి పథకాలు ప్రవేశపెట్టినా సిబ్బంది నిర్లక్షంతో అవి నీరు గారిపోతున్నాయని, ఇప్పటికైనా సిబ్బంది తీరు మెరుగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్థానికంగా డ్యూటి నిర్వహించి నిర్లక్షం వహించిన స్టాప్ నర్స్ సలోనిని సస్పెండ్ చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
షోకాజు నోటీసులు జారీ చేశాం..
ఇంచార్జీ డాక్టర్ సుమంత్ కుమార్
కొందుర్గులో గర్బిణి స్త్రీల పట్ల నిర్లక్షం వ్యవహరించిన స్టాప్ నర్స్ సలోమికి షోకాజు నోటీసులు జారి చేశాం. విచారణ అనంతరం చర్యలకై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఇలాంటి సంఘటన జరుగడం భాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

Comments

comments