Home రాష్ట్ర వార్తలు ప్రభుత్వ వైద్యుల సమ్మెబాట

ప్రభుత్వ వైద్యుల సమ్మెబాట

Doctors-Strike

రాష్ట్రప్రభుత్వానికి సమ్మె నోటీస్

హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ బి.రమేశ్, కోశాధికారి డాక్టర్ లాలు ప్రసా ద్‌ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రభుత్వానికి నోటీస్‌ను అందజేసింది. డిమాండ్ల ను ఆమోదించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి 18 రోజుల గడువును సంఘం వి ధించింది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాక పోతే ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ప్రతి రోజు ఒక గంట పాటు ఆందోళన నిర్వహిస్తామని, మే 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు బయటి రోగుల సేవలను బహిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నుంచి డిఎంఇ, డిహెచ్, టివివిపి, ఇఎస్‌ఐ ఆసుపత్రిలతో సహా అన్ని విభాగాల్లో అన్ని రకాల సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ఆరో గ్య సంచాలకుల విభాగాలన్నింటిలో పోస్టులను ప్రభుత్వ వైద్యులతోనే భర్తీ చేయాలని వారు డి మాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధి, ఉస్మా నియా, జిల్లా కేంద్రాల ఆసుపత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిం చారు. యుజిసి వేతనాలను అమలు చేయాలని, టివివిపిలో వైద్యులకు ట్రెజరీ నుంచి జీతాలి వ్వాలని, అన్ని పదోన్నతులు, బదిలీలు కౌన్సి లింగ్ ద్వారానే చేపట్టాలని, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆదిలాబాద్ రిమ్స్‌ల పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన వాటిగా కాకుం డా ప్రభుత్వ వైద్య కళాశాలలుగా కొనసాగించా లి. తెలంగాణ డిఎంఇకి కేటాయించిబడిన 171 మంది వైద్యుల కేటాయింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, అదే విధంగా డిహె చ్, ఇఎస్‌ఐలలో ఉన్న ఆంధ్రా వైద్యులను వారి రాష్ట్రానికి పంపించేయాలని వారు డిమాండ్ చేశా రు. తెలంగాణలో ఉండేందుకు తప్పుడు సమాచా రం ఇచ్చిన ఆంధ్రా వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. టిఎస్‌ఎంఐడి సి ద్వారా కాకుండా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, డిఎంహెచ్‌ఒల ద్వారా ఔషధాల సేకరణ ను పునరుద్ధరించాలన్నారు.

ఇలాంటి తెలంగాణ కోరుకోలేదు : ఇలాంటి తె లంగాణను మేము కోరుకోలేదని తెలంగాణ ప్ర భుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పి.ప్ర వీణ్ తెలిపారు. నాడు తెలంగాణ వైద్యులు చేసిన ఉద్యమం ఇలాంటి తెలంగాణ కోసం కాద ని, తెలంగాణ వస్తే ఆంధ్రా వైద్యులు వెళ్లి తెలం గాణ వారికి పదోన్నతులు వస్తాయనుకున్నామ న్నారు. ఆసుపత్రుల్లో మౌళిక వసతుల లేమి తొలిగి, అవ సరమైన ఔషధాలు లభ్యమై రోగులు బ్రతుకుతార నుకున్నాం. అయితే ప్రస్తుతం అలా లేదు. ఆం ధ్రా వైద్యులను వెనక్కి పంపించకుండా తెలంగా ణ వైద్యులకు పదోన్నతులు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు.