Home కెరీర్ ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాలు

Employee

 

 
ఎయిమ్స్, జోధ్‌పూర్‌లో 254 ఖాళీలు
సంస్థ: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్),
జోధ్‌పూర్, రాజస్థాన్.
పోస్టులు-ఖాళీలు: సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్)-127,
సీనియర్ రెసిడెంట్-127
అర్హత: బిఎస్‌సి (నర్సింగ్), ఎంబిబిఎస్‌తోపాటు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ, డీఎన్‌బీ, ఎంసీహెచ్, ఎంఎస్, ఎండీఎస్, డీఎం.
వయసు: స్టాఫ్ నర్సు పోస్టులకు 21-35 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్లకు 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్.
చివరి తేది: స్టాఫ్ నర్సు పోస్టులకు జూన్ 27, సీనియర్ రెసిడెంట్లకు జూన్ 30.
వెబ్‌సైట్: https://www.aiimsjodhpur.edu.in/

ఈఐఎల్‌లో 141 పోస్టులు
సంస్థ: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), న్యూఢిల్లీ
పోస్టులు: ఇంజినీర్, జూనియర్ అకౌంటెంట్ తదితరాలు.
ఖాళీలు: 141
అర్హత: సంబంధిత బ్రాంచులు/ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), డిప్లొమా, గ్రాడ్యుయేషన్, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్
చివరి తేది: 20.06.2018
వెబ్‌సైట్:http://www.engineersindia.com/

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు
పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ తదితర నాన్ టీచింగ్.
ఖాళీలు: 43
అర్హత: పదోతరగతి, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ/ఎంఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్. దరఖాస్తు ఫీజు: రూ.750.
చివరి తేది: 20.06.18 వెబ్‌సైట్: https://cutn.ac.in/

కాకినాడలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ వివిధ విభాగాల్లో సైనికుల నియామకానికి కింది జిల్లాలకు చెందిన అవివాహిత అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు/ పశ్చిమ గోదావరి, కృష్ణా,యానాం(పుదుచ్చేరి).
విభాగాలు: సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్.
అర్హతలు: పోస్టును బట్టి ఎనిమిది/ పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/ బయాలజీ, ఇంగ్లిష్) ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక: ధ్రువపత్రాల పరిశీలన, శారీరక దృఢత్వం/ కొలతలు, వైద్య, రాతపరీక్షల ఆధారంగా. ఎన్‌సిసి, స్పోర్ట్, ఎక్స్-సర్వీస్‌మెన్ తదితరులకు ప్రాధాన్యం ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 20.06.2018.
రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు: జులై 6 నుంచి 15 వరకు.
వేదిక: డిస్ట్రిక్ట్ స్పోర్ట్ స్టేడియం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
వెబ్‌సైట్:www.joinindianarmy.nic.in

నిట్ కాలికట్‌లో ఫ్యాకల్టీ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌లో
తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ
ఖాళీలు: 102.
విభాగాలు:ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, సివిల్, కెమికల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, జర్మన్, ఫ్రెంచ్, నానో సైన్స్.
అర్హత: బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
ఈ మెయిల్ దరఖాస్తు చివరి తేది: 06.06.2018.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 26, 27.
వేదిక: నిట్ కాలికట్, కోజికోడ్, కేరళ.
వెబ్‌సైట్:www.nitc.ac.in

వాక్ ఇన్ ఇంటర్య్వూ

విఎంఎంసి ఎస్‌జేహెచ్‌లో స్టాఫ్ నర్సులు
న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్,
సఫ్‌దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల భర్తీ.
పోస్టు-ఖాళీలు: స్టాఫ్ నర్స్- 932.
అర్హత: నర్సింగ్‌లో బీఎస్సీ(ఆనర్స్)/బీఎస్సీ/ పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఉత్తీర్ణత.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య.
ఎంపిక: విద్యార్హత, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా.
రిజిస్ట్రేషన్ తేది (సఫ్‌దర్‌జంగ్ హాస్పిటల్): 10.06.2018
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ: 25.06.2018.
వేదిక: వీఎంఎంసీ ఎస్‌జేహెచ్, న్యూఢిల్లీ; వెబ్‌సైట్:www.vmmc-sjh.nic.in

హార్టిసెట్-2018
వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం.. నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే హార్టిసెట్ -2018 ప్రకటన విడుదల చేసింది.
సీట్ల సంఖ్య: 83
అర్హత:డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా (హార్టి కల్చర్) ఉత్తీర్ణత.
వయసు: 17-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 28.06.2018.
పరీక్ష తేది: 18.07.2018. ; వెబ్‌సైట్:www.drysrhu.edu.in

అంబేద్కర్ వర్శిటీ డిగ్రీ అర్హత పరీక్ష
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష-2018(రెండోసారి)కు దరఖాస్తులు.
కోర్సులు: మూడేళ్ల బీఏ, బీకాం, బీఎస్సీ.
అర్హత, ఎంపిక విధానం: కనీస విద్యార్హత లేని అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
వయసు: 01.07.2018 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 20.06.2018.
ప్రవేశపరీక్ష తేది: 24.06.2018. వెబ్‌సైట్: www.braouonline.in

ప్రవేశాలు

తెలంగాణ వ్యవసాయ పాలిటెక్నిక్‌లు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018-19 సంవత్సరానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది.
విభాగాలు:1)వ్యవసాయం(రెండేళ్లు)
2)విత్తన సాంకేతిక పరిజ్ఞానం(రెండేళ్లు) 3)అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)
మొత్తంసీట్ల సంఖ్య:1020(ప్రభుత్వ-390, ప్రైవేటు-630)
అర్హత: తెలంగాణకు చెందిన పదోతరగతి ఉత్తీర్ణులు. ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు కారు.
వయసు: 31.12.2018 నాటికి 15-22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:18.06.2018 వెబ్‌సైట్: http:// pjtsau.ac.in/

తెలంగాణలో డీఫార్మసీ కోర్సు
తెలంగాణ ప్రభుత్వం, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ) కోర్సు ప్రవేశాలు.
అర్హత: ఇంటర్ (బైపీసీ లేదా ఎంపీసీ) ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 04.06.2018 నుంచి 15.06.2018 వరకు.
వెబ్‌సైట్:http://dtets.cgg.gov.in/