Home తాజా వార్తలు ట్రాక్టర్ బోల్తా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ట్రాక్టర్ బోల్తా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

accdnt

వలిగొండ:  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండలో ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.  ప్రభుత్వం తరపున ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి  అందజేశారు. గత ఆదివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ మూసీ కాల్వలోకి పల్టీ కొట్టడంతో 15 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.