Home కరీంనగర్ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

Farmer-Protestఎల్కతుర్తి : అష్టకష్టాలకోర్చి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కర్రె భిక్షపతి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డును పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి రైతుల పక్షాన ఆందోళన చేశారు. యార్డులో సుమారు రెండు వేల బస్తాల వరి ధాన్యం నిల్వ ఉన్న అధికారులు, మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని అన్నారు. దీంతో రైతులు వారం రోజులుగా పగలు, రాత్రి యార్డులోనే పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు చేయించాలని కోరారు. ఆందోళనలో పార్టీ మండల కార్యదర్శి ఊట్కూరి రాములు, నాయకులు బత్తిని అనిల్, చొక్కం రాజు తదితరులు పాల్గొన్నారు.