Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి

Mancheriala-Congress

మంచిర్యాలప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎంఎల్‌సి నారా నరపరాజు రాంచందర్‌రావు కోరారు. శుక్రవారం మంచిర్యాల టిఎన్‌జిఓ భవన్‌లో జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న  సంక్షేమ పథకాలను అర్హులన ప్రజలకు అందించడంలో పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

ఎ న్నికల సమయంలో ఇచ్చిన హామీలను నె రవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందన్నారు. దళితులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గోనెశ్యాసు ందర్‌రావు, నాయకులు ఆరుముల్లపోషం, మున్నారాజా సిసోడియా, పూసాల వెంకన్న, గోలి రాము, గొప్పు సతీష్, మోటపల్కుల తిరుపతి, లింగన్నపేట విజయ్, అశోక్‌వర్థన్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments