Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

12శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

Government Give to 12 Percentage Reservation Of ST Sc

మన తెలంగాణ/కొడంగల్: ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ లో మైనారిటీల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ అన్నారు. శనివారం స్థానిక కెఎస్‌వి ఫంక్షన్ హాల్‌లో నిరు పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్‌లను పంపిణీణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మైనార్టీల అభివృధ్దికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 240మైనార్టీ గురుకులాల ను ఏర్పాటు చే సి 65వేల మంది విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉచిత  పేర్కొన్నారు. విదేశాలలో విద్యను అభ్యసించే మైనారిటిలకు రూ.20లక్షల అర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. షాది ముభారక్ పథకం బీద ముస్లింలకు వరంగా మారిందన్నారు. హిందు,ముస్లింలను కేసిఆర్ రెండు కండ్లుగా బావిస్తారని మహముద్ ఆలీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మైనారిటిలను పట్టించుకోలేదని తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పరిస్థితులను గమనించిన కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వారి సంక్షేమానికి పునుకున్నారని చెప్పారు. మైనారిటిలకు 12శాతం రిజర్వేషన్లు ఆమలు చేయడానికి తమ ప్రభుత్వం కంకణబద్దంగా ఉందన్నారు. ఇది వరకే రాష్ట్ర ఆసేంబ్లిలో తిర్మానించి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దినిపై కేంద్రం సానుకులంగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేరళ తరహా రిజర్వేషన్లు ఆమలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మబలిదానానికి పాల్పడిన అయూబ్ ఖాన్ కుటుంబాన్ని అన్ని విదాల ప్రభుత్వం అదుకుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రవాణ వ్యవస్థను మేరుగు పరిచేందుకు బస్ డిపోను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 8న బస్సు డిపో నిర్మాణానికి మంత్రి హరిష్‌రావు శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. అంతకు మందు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో మైనారిటిలకు 12శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని హామి ఇచ్చి నేటికి కాంగ్రేస్ ప్రభుత్వం ఆమలు చేసిన 4శాతం రిజర్వేషన్‌నే కొనసాగిస్తున్నారని చమత్కరించారు. అత్యధికంగా నిరు పేద ముస్లింలు ఉన్న కొడంగల్ నియోజకవర్గానికి కుట్టు మిషన్‌లు అదనంగా కేటాయించాలని మంత్రులను కోరారు. అనంతరం నియోజకవర్గానికి కేటాయించిన 500కుట్టు మిషన్‌లను మహిళలకు పంపిణీ చేశారు.
-మల్లి తెరపైకి ప్రోటోకాల్ రగడ….
ప్రోటోకాల్ రగడ మళ్ళి తెరపైకి వచ్చింది. శనివారం జరిగన మైనారిటిలకు కుట్టుమిషన్‌ల పంపిణి కార్యాక్రమంలో ఈ ఆంశాన్ని స్ధానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. అధికారిక కార్యాక్రమాలను నిర్వహించే ముందు అధికారులు తనకు సమాచారం అందించడం లేదని ఎమ్మెల్యే కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్‌కు సభా ముకంగా ఫిర్యాదు చేశారు. స్ధానికంగా ఉన్న ఎమ్మెల్యేకే సమాచారం అందించక పోవడంపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి,ఆర్‌డిఓ వేణుమాదవరావు,జడ్పిటిసి సభ్యురాలు ఎల్లమ్మ,ఎంపిపి ధయాకర్‌రెడ్డి,సర్పంచ్ వేంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

comments