Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఉద్యోగినులకు 5 రోజుల స్పెషల్ లీవ్

government gives five special casual leave employees

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగినులందరికీ ఐదు రోజుల అదనపు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌లు మంజూరు చేసూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న క్యాజువల్ లీవ్‌లు, ఆప్షనల్ సెలవులకు ఈ ఐదు రోజుల సెలవులు అదనం అని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగినులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవులను ప్రకటించగా తాజా ప్రకటించిన ఐదు రోజులతో కలిపి మొత్తం పది రోజులవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవులను ఇవ్వాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా అప్పట్లోనే ఇది అమలుకాగా ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న మహిళా జూనియర్ లెక్చరర్లకు కూడా దీన్ని వర్తింపజేయాలన్న విజ్ఞప్తులకు అప్పటి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత గతేడాది తెలంగాణ ప్రభుత్వంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగినికి ఏడాదికి ఐదు రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం విధాన నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేయాల్సిందిగా కోరడంతో సానుకూలంగా స్పందించిన కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Comments

comments