Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కేంద్రం మరో బాదుడు : సేవింగ్స్‌లో 50వేలు.. కరెంట్‌లో లక్ష మాత్రమే!?

PM MODI Banningనల్ల ధనంపై యుద్దం, అవినీతి కట్టడి పేరుతో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500. రూ.1000 నోట్లను రద్దు చేసున్నట్ల ప్రకటించారు. అనాటి నుంచి ఇప్పటి వరకు తమ తమ నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.
కాగా ప్రధాని నోట్ల రద్దును ప్రకటించిస్తూ.. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ముందు మరిన్ని కఠిన చర్యలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మరో షాకింగ్ వార్త తాజాగా వినిపిస్తుంది. డిసెంబర్ 30 నాటికి ఈ నోట్ల మార్పిడి తతంగం ముగసిన తర్వాత కేంద్రం మరో బాదుడుకు సిద్ధమైతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కేవలం నోట్లపైనే నిషేధం విధించింన కేంద్ర, జనవరి 1 నుంచి డబ్బు వేసుందుకు, తీసేందుకు పరిమితిలు విధించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలపై కూడా పన్ను విధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందటా.. ఈ మేరకు ఖాతాదారులు బ్యాంకుల్లో జరిపిన లావాదేవీలకు సంబంధించిన పన్ను కట్టాల్సి వస్తుంది.
అయితే బ్యాంకుల్లో వేయకుండా నగదు దగ్గర ఉంచుకుంటే కూడా కష్టమే.. వ్యక్తులు, సంస్థలు బ్యాంకుల్లో వేయకుండా తమ వద్ద ఉంచుకొనే నగదు విషయంలో కూడా పరిమితి విధించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వద్ద ఉంచుకొనే డబ్బు రూ.3లక్షల నుంచి 5లక్షలకు మించంకుండా ఉండే విధంగా నిబంధనలు విధించనున్నారు. దీంతో భారీ లావాదేవిలు ఏం చేసిన బ్యాంకుల ద్వారానో, లేక ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఒక వ్యక్తి వ్యక్తిగత ఖాతాలో సేవింగ్స్ అయితే రూ.50 వేలు, కరెంట్ ఖాతా అయితే రూ.లక్ష కట్టడి విధించనున్నారని తెలస్తోంది. ఇలా అయితే ఇప్పడు ప్రజలు ఎదుర్కొంటున్న వాటి కంటే మరిన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. ఒకవైపు ప్రజలు ఇబ్బందలు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతూనే.. వెనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే యోచనలో కేంద్రం ఉండటంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Comments

comments