Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వంద డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు..

Government Granted hundred Double Bedroom Houses
యాదాద్రి : యాదగిరిగుట్టకు వంద డబుల్‌ బెడ్‌రూంలు , నూతన అంబెద్కర్ భవన నిర్మాణంకు అమలు జరిగాయని ప్రభుత్వవిప్ గొంగిడి సునీత మహెందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం జరపనున్నా పలు సీసీ రోడ్ల పనులకు ప్రభుత్వవిప్ శంకుస్థాపన చేశారు. శనివారం రోజున మండల కేంద్రము పరిధిలోని న్యూగుండ్లపల్లి, చెక్క్‌పోస్టు, యాదగిరిపల్లి ప్రాంతాలల్లో సిసి రోడ్లకు ఆమే శంకుస్థాపన చేసిన సందర్బంగా గ్రామపంచాయితీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రభత్వవిప్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్‌ బెడ్‌రూం పథకం కింద వంద గదులు, పట్టణ కేంద్రములో అంబెద్కర్ భవన నిర్మాణంకు నిధులు మంజూరి అయినాయని వీటి నిర్మాణంకు ప్రభుత్వభూమిని సేకరించి త్వరలో పనులు చేపడుతామని తెలిపారు. మండల కేంద్రములో ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం 5లక్షల నిదులనుకూడ త్వరలో అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలో ఎంపిపి గడ్డమీది స్వప్నరవీందర్,జెట్‌పిటిసి కర్రె కమలమ్మ, సర్పంచ్ బూడిది స్వామి, ఎంపిటిసి సీస కృష్ణ, ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యలు అండాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments