Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వికలాంగులకు ప్రభుత్వం చేయూత

 Government has made it to the disabled People

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని, ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పోరేషన్ హైద్రాబాద్ నుంచి మంజూరైన ల్యాప్‌టాప్‌ను రామచంద్రాపురానికి చెందిన అవినాష్ (అంధుడు) అనే దివ్యాంగుడికి మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ చేతుల మీదుగా కలెక్టర్ అందజేశారు. అలాగే హత్నూర మండలం దౌల్తాబాద్‌కు చెందిన ( శారీరక వికలాంగుడైన నర్సింలు, కంది మండలానికి చెందిన అలీ, హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన సంజీవ్, మనూర్ మండలం మైకోడ్ గ్రామానికి చెందిన పార్వతమ్మ అనే దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనందిస్తుందని, ఈ అవకాశాన్ని లబ్ధ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి నిఖిల, జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధ్దుల సంక్షేమాధికారి మోతీ, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్గనైజర్ లక్ష్మీ తదితరులు ఉన్నారు.

Comments

comments