Search
Friday 16 November 2018
  • :
  • :

పసికందుల జీవితాలతో చెలగాటం!

నెలల తరబడి అందని వాక్సిన్
భవిష్యత్‌లో పోలియో బారిన పడే అవకాశం
మొద్దు నిద్రలో వైద్యశాఖ అధికారులు
భయాందోళనలో తల్లిదండ్రులు
 పట్టించుకోని ప్రజాప్రతినిధులు
సిఎంని అడగండని బదులిస్తున్న వైద్య సిబ్బంది

Govt-hospitalకుభీర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలు అందిస్తున్నామని చెబు తున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం అది కనిపించడంలేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం డివిజన్ పరిధిలో పసికందులకు తరచు వ్యాక్సిన్ లేదని వైద్యాధికారులు పసికందులకు వ్యాక్సిన్‌లు ఇవ్వడం లేదు. పసికందు పుట్టిన నుంచి నెలకు టీకాతో పాటు పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి.అలా ఇవ్వకుండా పసికందుల జీవితాలతో చెలగాటం ఆడతున్నారనే విమర్షలు ఉన్నాయి.

వ్యాక్సిన్‌లు రావడం లేదని చెబుతున్న అధికారులు శ్రీమంతులకు వ్యాక్సిన్ లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుపేద ప్రజలకు వ్యాక్సిన్‌లు రావడం లేదని ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రుల లో వ్యాక్సిన్ తీసుకొండి అని అధి కారులు చెబుతున్నారని పలువు రు అంటున్నారు. పోలియో వ్యాక్సిన్ ఇవ్వకపోవడంపై పసికందుల తల్లిదండ్రు లు భయాందోళనలకు గురవుతున్నారు. వ్యాక్సిన్‌ల కోసం ప్రతి వారం ఆ సుపత్రుల చుట్టూ తిరుగుతున్నా వ్యాక్సిన్ మాత్రం ఇవ్వడం లేదని పైనుండే వ్యాక్సిన్ సర ఫరా కాలేదని వ్యాక్సిన్ ఎందుకు రాలేదని అడిగితే ప్రశ్నించగా సిఎంని అడగండి అని అంటున్నారు.

అధికారులు చెబుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.వ్యాక్సిన్ ఇవ్వ కపోవడంపై తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాలలో తిరిగి వైద్యసేవలు అందించాల్సిన అధికారులు తమకేమి ప ట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉండి వైద్యసేవలు అందించా ల్సిన వైద్యులు పట్టణాలనుండి రాకపోకలు సాగిస్తూ సమయపాలన పా టించడం లేదని అలాగే ఆసుపత్రి ఒకపూటే వైద్య సేవలు అందిస్తున్నా రని పలువురు అంటున్నారు.

ఒకపూటే వైద్య సేవలు అందించడంతో రోగులు ఆసుపత్రికి వచ్చి తిరిగి వ్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తు న్నారని పలువురు అంటున్నారు.మారుమూల గ్రామాలలో వైద్య సేవలు అందడం లేదని విమర్శ ఉంది. అలాగే వ్యాక్సిన్‌లు ఇ వ్వకపోతే భవిష్యత్‌లో తమ పిల్లలకు పోలియో వ్యాది వ స్తుందేమోనని తల్లిదండ్రులు భయోందళనలకు గురవు తున్నారు.ఈ విషయమై డాక్టర్ శ్యాంకుమార్‌కు వి వరణ కోరగా నిర్మల్ జిల్లా కొత్తగా ఏర్పడగా ఆది లాబాద్ నుంచి వ్యాక్సిన్‌కు సంబందించి పలు పరికరాలను నిర్మల్ జిల్లా ఏర్పాటు చేస్తున్నందున వ్యాక్సిన్ సరఫరా కాలేదని తెలిపారు.

Comments

comments