Home హైదరాబాద్ ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ

ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ

Government hospitals have good days

వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట
కార్పొరేట్‌కు దీటుగా ఆసుపత్రులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల ప్రస్థానంలో నగరంలోని ప్రభుత్వాసుపత్రులకు మంచిరోజులు వచ్చాయి. మొన్నటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల తీరు దయనీయంగా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ది చేస్తోంది. ప్రధానంగా నిమ్స్‌లో 500, నిలోఫర్‌లో 500, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 250 పడకలను పెంచడంతో పాటు అన్ని సర్కా ర్ ఆసుపత్రుల్లో రోగులను ఇన్‌ఫెక్షన్ బారి నుంచి కాపాడేందుకు రోజుకో రంగు దుప్పటిని మార్చేందుకు నూతనంగా దుప్పట్లను ప్రవేశపెట్టింది. ఇంతే కాకుండా ఏరియా ఆసుపత్రుల్లో ఐసియూల ఏర్పాటుతో పాటు డయాలసిస్ సెంటర్‌లకు శ్రీకారం చుట్టింది. సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల పథకం ద్వారా నగరంలోని అన్ని ప్రభుత్వాసుప్రతుల్లో ప్రతి పడకకు రూ.5వేలు ఖర్చు చేస్తున్నది.

 డయాలిసిస్ కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు….
రాష్ట్రం ఆవిర్భావం నాటికి నిమ్స్, ఉస్మానియా,గాంధీ దవాఖానాల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉండేవి. కిడ్నీ బాధితులు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. మ రోవైపు పెరుగుతోన్న కిడ్నీ బాధితుల కోసం దేశంలోనే ప్రభుత్వ రంగ ంలో మొదటిసారిగా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం విస్తరిస్తున్నది.ఇంతేకాకుండా డయాలసిస్ రోగులకు బస్‌పాస్‌లను సైతం ఉచితంగా అందించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వా రా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. అవసరాలను బట్టి కొత్తగాబ్లడ్ బ్యాంకులు లేదా బ్లడ్ స్టోరేజి యూనిట్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల క్షతగాత్రులు ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు.

 అవయవ మార్పిడులు, అరుదైన ఆపరేషన్లు….

ప్రభుత్వాసుపత్రుల్లో కిడ్నీ, గుండె, పాంక్రిటియాస్,కాలేయ మార్పిడిలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిమ్స్‌లో 110 అవయవ మార్పిడిలను విజయవంతంగా నిర్వహించగా, ఉస్మానియా చరిత్రలోనే తొలిసారిగా కిడ్నీ పాంక్రియాటిస్ సర్జరీని వైద్యులు నిర్వహించారు. అరుదైన ప్లాస్టిక్ సర్జరీలు, ఇతర చికిత్సలు ప్రభుత్వ దవాఖానాల్లో జరుగుతున్నాయి.

 వాహనాలు, వైద్యసేవలు….

108 వాహనాలు అందిస్తున్న సేవలను విస్త్రృత పరుస్తూ, ఇప్పటికే ఉన్న వాహనాలకు తోడుగా మరో 145 కొత్త వాహనాలను అధికారులు సమకూర్చారు. వీటికి అదనంగా 104 వాహనాలు పనిచేస్తున్నాయి. మారు మూల గల్లీలకు వెళ్లి అత్యవసర సమయంలో రోగులను సకాలంలో ఆ సుపత్రులకు చేర్చడం కోసం 108 బైక్ అంబులెన్స్‌లను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిరుపేదలకు నిరంతర మోబైల్ వైద్యం అందించేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో హెలీక్యాప్టర్‌లను ఉపయోగిస్తున్నారు.

 కేసీఆర్ కిట్స్….
మహిళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ప్రసూతి అయిన తల్లీ బిడ్డల కు ప్రభుత్వం కేసీఆర్ కిట్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వా రా పుట్టిన బిడ్డకు 15రకాల వస్తువులతో పాటు మగపిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడపిల్లపుడితే రూ.13వేలను నాలుగు విడతలుగా ఇస్తున్నారు.

 ఆరోగ్యశ్రీ, వెల్‌నెస్ సెంటర్లు….

ఆరోగ్యశ్రీ చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెంచగా, గతంలో 30 శాతం మాత్రమే ఉన్న చికిత్సలు 40శాతం వరకు పెరిగాయి. ఆరోగ్యశ్రీలో మరిన్ని చికిత్సలను చేర్చి, పటిష్ట పరిచారు. ఇంతే కాకుండా ఉద్యోగులు, జర్నలిస్టులు,పెన్షెనర్ల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వె ల్‌నెస్ సెంటర్‌లను విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలో ఖైరతాబాద్,వనస్థల్లిపురంలో కొనసాగుతుండగా త్వరలో కూకట్‌పల్లిలో మరో వెల్‌నెస్‌సెంటర్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.