Home తాజా వార్తలు ఉచిత శిక్షణ తరగతులు

ఉచిత శిక్షణ తరగతులు

Free Training for Tribals

హైదరాబాద్: ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉచిత కంప్యూటర్ డెస్క్‌టాప్ కోర్సులను నిర్వహించనున్నారు. పేద మద్యతరగతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ హనుమానాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి చదువుకున్న యువతీ యువకులకు ఉచితంగా కంప్యూటర్ డెస్క్ టాప్ కోర్సులను నేర్పించనున్నామని తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. 26తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌తో పాటు జాబ్ ఇప్పిస్తామని  హమీ ఇచ్చారు . ఆసక్తి గల వారు ఆధార్ కార్డు జీరాక్స్, పదవతరగతి పాస్ మెమో జీరాక్స్, పాస్ పోర్టు సైజ్ రెండు ఫోటోలతో ఆర్టిసి క్రాస్ రోడ్డులోని ఐటిఐ కేంద్రంలో  దరఖాస్తూ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 79979 73463 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని కోరారు.