Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సర్కార్ నజర్

ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సర్కార్ నజర్

నేటి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన
రెవెన్యూ అధికారులు తాజా ఆదేశాలు

Land-Mafia

సిర్పూర్(యు): జిల్లాల విభజన అంనతరం అన్ని గణంకాలు మారుతుండగా తాజా గా ప్రభుత్వం అసైండ్, సర్కార్ భూములపై నిఘా పెట్టింది. క్షేత్ర స్థాయిలో వీటి పరిశీలనకు మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. శని వారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాలతో పాటు హ్యబిటేషన్‌లలో పర్యటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ భూములతో పాటు అర్హులైన నిరుపేదలరైతులకు ఇచ్చిన అసైండ్ భూ ములు ప్రస్తుతం ఎవరి పేరిట ఉన్నాయి..? సాగు చేస్తున్న వారి వివరాలు, పట్టేదార్ల జాబితాల ఆధా రంగా వీటి పరిశీలన జరగనుంది. జిల్లాల పునర్వి భజన తరువాత లెక్క తేలకపోవడంతో సర్కార్ దీనిపై సీరియస్‌గా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలు స్తోంది.

కుమ్రం భీం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్కార్ తరుపున పొందిన అసైన్డ్ భూములతో పాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైన భూములతో పాటు పూర్తి వివరాలు క్రోడి కరించడంతో పాటు డిమార్కేషన్ ఎంత వరకు జరి గిందన్న కోణంలో క్షేత్ర స్థాయి పరిశీలన జరగనుం ది. సాగు అవుతున్న భూములు, పట్టేదార్ వివరాలు, కబ్జ తదితర అంశాలతో నమూన ఫార్మెట్‌ను తయా రు చేసి తనుగుణంగా పది రోజుల పాటు అధికా రులు గ్రామాల బాటపట్టానున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్ర వారం ప్రత్యేక సమావేశం జరిగింది. వీఆర్వో లకు ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల మార్గదర్శకాలు జారీ చేశారు.  గ్రామాల్లో పర్యటించే అధికారులు రైతులు పూర్తి సమాచారన్ని అందించాలని ఏదైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.