Home తాజా వార్తలు ఆర్‌టిసితో ప్రభుత్వం చర్చలు…

ఆర్‌టిసితో ప్రభుత్వం చర్చలు…

Telangana RTC JAC Round Table Meeting Today

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ అర్‌టిసి)లో సమ్మె సైరన్ మోగించడంతో ప్రభుత్వం ఆర్‌టిసి నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 8న చర్చలకు రావాలని గుర్తింపు సంఘం టిఎంయు, ఆర్‌టిసి జెఎసిని లేబర్ కమిషనర్ ఆహ్వానించారు. వేతనాల పెంపు కోసం సమ్మె నిర్వహించాలని కార్మికలోకం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. ప్రభుత్వం, ఆర్‌టిసి యాజమాన్యం నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని ఇప్పటివరకు వేచి చూశామని, కానీ అలాంటిదేమీ కనిపించడంలేదని మండిపడింది. మే 7న సమ్మె నోటీసు ఇచ్చామని, కార్మకశాఖ మధ్యవర్తిత్వ సమావేశాన్ని నిర్వహించకపోగా, ప్రభుత్వమే కార్మికశాఖ ద్వారా బెదిరింపులకు దిగుతోందని ఆరోపించింది. మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు ఫలించలేదని పేర్కొంది. దీంతో ఈ నెల 10న అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేసి సమ్మెను ప్రారంభించాలని తీర్మానించిన విషయం తెలిసిందే.