Search
Saturday 22 September 2018
  • :
  • :

గొల్ల కురుమల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

 government is a big base for the Welfare of Golla Kurumala

వెల్దండ: గొల్ల కురుమల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మహబుబ్‌నగర్ ఎంఎల్‌సి కసిరెడ్డి, నారాయణరెడ్డి అన్నారు. బుధవారం వెల్దండ మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో జరిగిన గొర్రెలకు దాణా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు దాణాను గొల్ల కురుమ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్ల కాపరుల, గొల్ల కురుమల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని ఎన్నో ప్రజాకార్షక పథకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ద్యాప విజితారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ యెన్నం భూపతిరెడ్డి, ఎంపిపి రాజశేఖర్, మండల పశువైద్యాధికారి దేవిరెడ్డి, జడ్పీటీసి తనయుడు తెరాస తాలూకా నాయకుడు వావిళ్ళ సంజీవ్ కుమార్ యాదవ్, పిఏసిఎస్ చైర్మెన్ ద్యాప మోహన్‌రెడ్డి, సర్పంచ్ రామస్వామి, ఎంపిటీసి నాగులూనాయక్ నాయకులు నారాయణ, హరికిషన్, కొండల్, రాజశేఖర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments