Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

flower

*మౌలిక వసతుల కల్పనకు రూ.16వేల కోట్లు
నిధులు మంజూరు
*పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి
విద్యనందించడమే ప్రభుత్వ లక్షం
*వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

మనతెలంగాణ/బోధన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొ న్నారు. కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం రూ.కోటి ఇరవై లక్షలతో నిర్మించిన కస్తూర్బా భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిం దన్నారు. సుమారు రూ.16 వేల కోట్లతో విద్యారంగంలో మౌలిక వసతులే కల్పి ంచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే లక్షంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విద్యార్థులను ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దే దశలో ప్రభుత్వ ఉపాధ్యా యులు కీలకపాత్ర పోషించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందినట్లయితే విద్యార్థులు ఉపాధి అవకాశాలను తమంతట తామే ఎంచుకుంటారన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యను అందించే దిశలో ప్రభు త్వం పనిచేస్తుందని, అందుకోసం కెజి టు పిజి ఉచిత విద్యను ప్రభుత్వం ప్రవేశ పెడుతుందన్నారు. ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన వసతి కల్పించి సన్న బియ్యంతో వారి ఆకలిని తీర్చడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించే దిశలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు.
కార్యకర్తల సమావేశం
కోటగిరి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడూతూ ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు. కార్య కర్త లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, అపోహలు నమ్మకుండా ప్రజలు ప్రభు త్వంపై భరోసా ఉంచాలన్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు డబ్బులను ఎరచూపి మభ్యపెట్టాలను కుంటున్నారని, ప్రజలు అలాంటివి నమ్మరని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సేవచేసే నాయకులనే ఎంచుకుంటున్నారన్నారు.
తాను నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. రబీ పంటలకు ఏడు తడులు సాగునీరు అందించి రైతులను పూర్తిగా ఆదు కుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సులోచన, జడ్పిటిసి శంకర్, సర్పంచ్ స్వరూప గంగాధర్, వైస్ ఎంపిపి శ్రీనివాస్‌రావు పార్టీ నాయ కులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments