Home రాష్ట్ర వార్తలు ప్రజాస్వామ్య సోయి తప్పిన ప్రభుత్వం

ప్రజాస్వామ్య సోయి తప్పిన ప్రభుత్వం

  • పాలకుల కుట్రలు విఫలమయ్యాయి
  • విజయం సాధించాం, అఖిలపక్షాన్ని సమావేశ పర్చాలి
  • ధర్నాచౌక్ సభలో ప్రతిపక్షాలు, జెఎసి

Oppositions

హైదరాబాద్ : ధర్నాచౌక్‌పై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ, సిపిఐ(ఎం), టిజెఎసి, కాంగ్రెస్, టిడిపి, బిజెపి తెలంగాణ ప్రజా ఫ్రంట్, జనసేన, లోక్‌సత్తా తదితర పక్షాలు, ప్రజా సంఘా ల నాయకులు డిమాండ్ చేశారు. సుధీర్ఘ పోరా టం అనంతరం సోమవారం ధర్నాచౌక్‌ను స్వాధీ నం చేసుకొని ఇక్కడ సభ నిర్వహించుకోవడం ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల విజయమని ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు అన్నారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలతో పోటీ ధర్నా పెట్టించి, పోలీసులతో ఉద్యమకారులపై కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని వారు తీవ్రంగా ఖండిం చారు. సభలో తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ తాము శాంతి యుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వమే ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య సోయిని తప్పినట్టుగా కనపిస్తోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలను నుంచి తప్పుకుం దని, ధర్నాచౌక్ విషయంలో మీరు మీరే (ధర్నా చౌక్ అనుకూల, వ్యతిరేక వర్గాలు) పరిష్కరించుకోండనే రీతిలో వ్యవహారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘర్షణలకు పోలీసు కమిషనరే బాధ్యత వహించాలన్నారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా స్వామ్యం పద్ధతిలో నిరసన తెలిపే హక్కును సిఎం కెసిఆర్ అణగదొ క్కుతూ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ధర్నాచౌక్‌ను పునరు ద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధర్నా చౌక్‌ను కొనసాగించాలనే వారికి, ధర్నా చౌక్‌ను తరలించాలనే వారికి కెసిఆర్ ప్రభుత్వం ఒకే రోజు అనుమతించి ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు. కెసిఆర్ కనుసైగ ల్లో పోలీసులు పనిచేస్తూ కొంత మందిని రెచ్చగొట్టి ధర్నా చౌక్ వద్దంటూ కాలనీవాసుల ముసుగులో వారిచేత రాత్రికి రాత్రే టెంట్లు వేయించి రాచమర్యాదలు చేయడం కెసిఆర్ దివాలా… కోరు రాజకీయాలకు నిదర్శనమ న్నారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడు తూ కెసిర్ ప్రభుత్వం స్థానికులను, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్ స్వాధీన కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ కుట్రకు తగిన బుద్ది చెప్పారన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనమంతరావు మాట్లాడుతూ బస్తీ నాయకులు, వాకర్స్ అసోయేషన్ నేతలతో తాను స్వయంగా మాట్లాడానని, ధర్నా చౌక్‌కు పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరు వ్యతిరేకంగా లేరన్నారు. పరిపాలన చేతకాని సిఎం కెసిఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మప్టీ పోలీసులతో ధర్నా నాటకమాడి శాంతి భద్రతల సాకు చూపి ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తేందుకు కుట్ర పన్నారన్నారు. టిడిపి వర్కింగ్‌ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న కెసిఆర్‌కు కాపాలా కాసిన కమ్యూనిస్టుల పైనే ఇప్పుడు పోలీసులతో దాడి చేయించారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీలతో చెలగాటం ఆడుతోందని, నిజాంకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంద న్నారు. నిరసనలకు అనుమతులు ఇవ్వకుంటే ప్రగతిభవన్, సచివాలయంలోని సమతాబ్లాక్‌ను ఆక్రమిస్తామని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.ర మణ మాట్లాడుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తే ధర్నా చౌక్‌నే కాదు సిఎం కెసిఆర్ నగరం నడిబొడ్డున నిర్మించుకున్న నయా గడి ప్రగతి భవన్‌ను కూడా అక్రమించుకుంటామన్నారు. బిజెపి ఎంఎల్‌సి ఎన్.రామచంద్రరావు మాట్లాడు తూ ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలనే ఆలోచన దుర్మార్గమైందని, ధర్నా చౌక్ పునరు ద్దరణ కోసం జరిగే అన్ని పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంద న్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కోకన్వీనర్ ప్రొఫెసర్ పి.ల్.విశ్వే శ్వరరా వు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, కాంగ్రెస్ మాజీ మంత్రులు డి.కె.అరుణ, పి.సునీతాలకా్ష్మరెడ్డి, ఎంఎల్‌ఎలు టి.రామ్మెహన్‌రెడ్డి, సిహెచ్. వంశీచంద్‌రెడ్డి, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, బిజెపి నేతలు బద్దంబాల్ రెడ్డి, ఎంఎల్‌సి ఎన్.రామచంద్రరావు, మాజీ ఎంఎఎల్‌సి చుక్కా రామయ్య, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు గుండా మల్లేష్, మల్లేపల్లి ఆదిరెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేష్, డాక్టర్ డి.సుధాకర్ (సిపిఐ), చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, డి.జి.నరసింహారావు (సిపిఐ (ఎం), పోటు రంగారావు (సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ప్రొఫెసర్ ఇటి క్యాల పురుషోత్తం, జి.వెంకట్‌రెడ్డి (తెలంగాణ జెఎసి), కె.గోవర్ధన్ (సిపిఐ (ఎం ఎల్) న్యూడెమాక్రసీ), గాదె ఇన్నయ్య (తెలంగాణ ప్రజా వేదిక), వి.రత్నాకర్ రావు, వి.ఎస్.బోస్, బి.వెంకటేష్ (ఎఐటియుసి), వి.ఎన్.జ్యోతి (ఎన్‌ఎఫ్ ఐడ బ్లు), వి.సంధ్య (పిఓడబ్లు), విమలక్క (టిపిఎఫ్), సుజయ (సామాజిక కార్య కర్త), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ),ఎం.శంకర్ (జనసేన)తో పా టు లోక్‌సత్తా విద్యార్థి,యువజన, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.