Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ముస్లింల అభివృద్దికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

 Government is working for the development of Muslims

మన తెలంగాణ/మోత్కూరు : ముస్లింల అభివృద్దికి తెల ంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ పథకాల ను అమలు జరుపుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్ప లపల్లి మహేంద్రనాథ్, ఎంపిపి ఓర్సులక్ష్మి పురుషో త్తంలు అన్నారు. మండల కేంద్రంలోని ఎల్.ఎన్.గార్డెన్స్‌లో శుక్ర వారం సాయంత్రం అధికారికంగా మోత్కూరు, అడ్డగూ డూరు మండలాల్లోని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వది నాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కార్య క్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేం ద్రనాథ్, ఎంపిపి ఓర్సులక్ష్మి పురుషోత్తం లు మాట్లాడారు.
దామరచర్లలో:హిందూ -ముస్లింలు సోదర భావంతో మెలగాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలోని మసీద్‌లో ముస్లిం సోదరుల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇస్లాం అంటే శాంతికి నిలయమని, రంజాన్ మాసం పవిత్రమైన మాస మని, ఈ మాసంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నియమ నిబ ంధనలు తర్వాత కాలంలో కూడా ప్రతి మాన వుడు అను సరించనట్లయితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటా రన్నారు. ప్రతి వ్యక్తి దయ, కరుణ, మానవత్వం కలిగి మంచిని స్వీకంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్ప ంచ్ కుం దూరు వరలక్ష్మివీరకోటిరెడ్డి, డి.నారాయ ణరెడ్డి, ఎన్.కోట్యానాయక్, బాలునాయక్, పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురంలో : నారాయణపురం మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్ర వారం వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ ఆద్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎండి.రహీం షరీఫ్ మాట్లా డుతూ మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అన్నారు. హిందూ ముస్లింలు ఒక్కటే అనడానికి ఇలాంటి ఇప్తార్ విం దులే నిదర్శనమన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు కలిసివుం డాలన్నదే తన అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్, ఎన్నుదుల మహేష్, ఎండి.సోహెల్, ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments