Home నాగర్ కర్నూల్ కులవృత్తులను కాపాడి యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం

కులవృత్తులను కాపాడి యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం

government is working hard to establish employment opportunities

ఉపాధి అవకాశాల ఏర్పాటు కు కృషి చేస్తున్న ప్రభుత్వం
దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ
సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ/అచ్చంపేట: సమైక్య దోపిడీ దారుల పాలనలో అభివృద్ధిలో వెనుకకు నెట్టి వేయబడి, కేవలం కుల వృత్తులపైనే ఆధార పడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసా ని శ్రీనువాస్ యాదవ్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట మండలం లో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీనువాస్ యాదవ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.  ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ తండా, కాం సానిపల్లి తండా వరకు ఏర్పాటు నూతనంగా వేయనున్న రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశా రు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని అంగిరేకు ల శేఖరయ్య  ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభ లో మంత్రులు తలసాని, జూపల్లిలు పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధిలో వెనుక బాటు తనానికి గురైన అన్నికులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని శ్రీనువాస్ యాదవ్ అన్నారు. యాదవులకు గొర్రెల పంపిణీలతో పాటు, మత్స కారులకు ఉచితంగా చేపల పంపిణీ, మోపెడ్ వాహనాల పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభు త్వం ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా వినూత్న ఆలోచనలతో రైతుకు ఎకరాకు నాల్గువేల పెట్టుబడి సాయం అందించిందన్నారు. దీంతో పాటు రూ.5లక్షల రైతు బీమా పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పకడ్భందీగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులవుతుంటే చూసీ తట్టుకోలేని ప్రతిపక్షాలు అవినీతి పేరుతో కపట నాటకాలు ఆడుతూ ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అంతకుముందు పం చాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరును సస్యశామలం చేసే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా త్వరలోనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు పనులు జరుగుతున్ననాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతు బీమా వంటి పథకాలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. వివిధ సమస్యలపై మత్స పారిశ్రామిక సంఘం నాయకులు మంత్రి తలసానికి వినతిపత్రం అందజేశారు. మత్సకారులు మంత్రికి వల లు బహూకరించారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, నేతలు మంత్రులను పూలమాలలు వాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, రైతు సమన్వయ సమితీ జిల్లా కోఆర్డినేటర్ మనోహర్, మున్సిపల్ ఛైర్మెన్ తులసీరాం, ఎంపీపీ పర్వతాలు, జెడ్‌పీటీసి రామకృష్ణారెడ్డి, నర్సింహ్మగౌడ్, గణేష్ తదితరులున్నారు.