Home తాజా వార్తలు సింథటిక్ మాంజను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

సింథటిక్ మాంజను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Government issued a ban on synthetic manja

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో పతంగుల ఎగురవేత కోసం సింథటిక్ మాంజతో పాటు నైలాన్‌తో కూడిన దారాలను వాడకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మాంజ ఉత్పత్తి, విక్రయం, రవాణి, నిల్వతో పాటు అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులను జారీ చేశారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణశాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ సింథటిక్ మాంజ వినియోగాన్ని ఉపేక్షించకూడదని అటవీశాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Government issued a ban on synthetic manja