Home ఆదిలాబాద్ సర్కారు భూముల లెక్కలు తలకిందులు

సర్కారు భూముల లెక్కలు తలకిందులు

ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న కబ్జాలు
అందుబాటులో లేని రికార్డులు
కంప్యూటరీకరణతో కూడా తొలగని ఇబ్బందులు

land-mafiaమన తెలంగాణ / ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా సర్కారు భూముల లెక్కలు తలకిందులవుతున్నాయి. జిల్లా యంత్రాంగం వద్ద భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో కబ్జాదారులకు అడ్డులేకుండా పోతోంది. శిఖం భూములు, అసైన్డ్‌భూములు, ఇనాం భూములు, వక్ఫ్‌భూములు, దేవాదాయ భూములు యధేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారంటున్నారు. దీనికి తోడు చెరువులు, కందకాలను బహిరంగంగానే ఆక్రమించేస్తూ ఆ స్థలాల్లో శాశ్వత నిర్మాణాలను చేపడుతున్నారు. చారిత్రక కట్టడాలు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. అయితే ప్రభుత్వం వద్ద కొంతమేరకు మాత్రమే సర్కారు భూములకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్నాయి. కబ్జాదారులు పథకం ప్రకారం రెవెన్యూ కార్యాలయ రికార్డుల సిబ్బందితో మిలాఖత్ అయి కోట్లాది రూపాయాల భూముల రికార్డులను తారుమారు చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. తప్పుడు రికార్డులు సృష్టించి కొంతమంది సర్కారు భూములను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచి ర్యాల, బాసర, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, తదితర ప్రాంతాల్లోని సర్కారు భూముల రికార్డులు రెవె న్యూ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అందు బాటులో లేకపోవడం గమనార్హం. ఇలా ఆక్రమిం చుకున్న భూములకు కొంతమంది పట్టాలు సైతం సృష్టించుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ భూములకు పట్టాలు జారీ అవుతున్నట్లు చెబుతున్నారు. మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్ల పేరిట రికార్డులు సృష్టించుకొని సర్కారు భూములకు రిజిస్ట్రేషన్లు సైతం చేస్తుండడం గమనార్హం. ప్రభు త్వం గత కొద్దిరోజుల క్రితం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నింటినీ కంప్యూటరీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంప్యూటరీకరణ కూడా కబ్జాదారులకు వరంగా మారింది. పాత రికార్డులు అందుబాటులో లేకుండా వాటిని సంబంధిత కార్యాలయ సిబ్బంది సహకారంతో ముందుగానే గల్లంతు చేసి కంప్యూటరీకరణ కోసం రికార్డులు అందుబాటులో లేకుండా చేసినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో రికార్డులు అందుబాటు లో లేక చాలా ప్రభుత్వ భూములు కంప్యూటరీ కరణకు నోచుకోలేదు. అయితే ఈ భూములు ప్రైవేటు భూములుగా రికార్డులు సృష్టించి వాటిని కంప్యూటర్‌లలో నమోదు చేస్తుకు న్నట్లు చెబుతున్నారు. కంప్యూటర్‌లలో నమోదైన వారు ఆ పహానీలను చూపి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ కోట్లాది రూపాయాలను సంపాదిస్తున్నట్లు పేర్కొంటున్నారు. భూముల విలువ రోజురోజుకు పెరిగిపోవడంతో సర్కారు భూములు కబ్జాదా రులకు టార్గెట్‌గా మారాయి. ఇప్పటికైనా యం త్రాంగం ఈ వైపు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.