Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

Government Most Preparense To Development In  Villages

మన తెలంగాణ/సంగెం : ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ గ్రామాల అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తీగరాజుపల్లిలో రూ.50లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని భావించి వసతుల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందిచనున్నట్లు తెలిపారు. పేద వర్గాలకు అసరా పిం ఛన్లు, ఆహార భద్రత, కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, షాదీ ముబారక్‌తో పాటు రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మహారాష్ట్రాలలోని కొన్ని గ్రామా లు తెలంగాణ రాష్ట్రంలో తమను కలుపుకోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలంగా చేసేందుకు సిఎం కెసిఆర్ తన మేధోశక్తిని ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తియితే తెలంగాణ రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పించారని, అకాల మరణం, ప్రమాదవశాత్తు, ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా వస్తుందని అన్నారు. పరకాల నియోజకవర్గంలో ఇండ్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతలకు అనుసందానం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. తీగరాజుపల్లి గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రంగరాజు నర్సింహస్వామి, ఎపిటిసి బద్రి, ఎపిపి కట్టయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నరహరి, ఎంపిడిఒ మల్లేశం, తహసీల్దార్ సత్యనారాయణ, పిఆర్‌ఎఈ కృష్ణయ్య, ఆర్‌డబ్లుఎస్‌ఎఈ వేణు, వరంగల్ గ్రేన్ మార్కెట్ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, యాదగిరిరావు, మాదవరెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ : మండలంలోని తీగరాజుపల్లి సర్పంచ్ రంగరాజు నరసింహస్వామి తండ్రి రంగరాజు రామనారయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుకొని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Comments

comments