Home జోగులాంబ గద్వాల్ ఆసరాలో… ‘వేలిముద్రల’ అవినీతి

ఆసరాలో… ‘వేలిముద్రల’ అవినీతి

ఆసరాలో… ‘వేలిముద్రల’ అవినీతి
 ప్రతి నెల రూ.లక్ష వరకు పక్కదారి
కర్నాటక సరిహద్దు గ్రామాల్లో భారీగా దోపిడీ

Asara

ధరూరు: ఆసరా…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత ప్రభుత్వం చేపట్టిన ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకం… గత ప్రభు త్వాల కంటే కూడ భిన్నంగా పండుటాకులు, వితంతువులకు రూ. 1000, వికాలంగులకు రూ.1500 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తుంది. అయితే ఇదే కొందరి అవినీతి అధికారులకు, దళారులకు వరంగా మా రింది… ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున దోపిడికి పాల్పడుతున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారిస్తే విస్తూ పోయ్యో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈదోపిడి గత మూడేళ్లుగా నిరాటకంగా కొనసాగుతూనే ఉంది… కాని ఎవరు కూడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు.. ఈఅవినీతి ఇటివలీ నూతనంగా ఏర్పడిన కే.టీ.దొడ్డి మండల పరిధిలోని కొండాపురం, ఇర్కిచేడు, గువ్వలదిన్నే గ్రామాల్లో జరుగుతుంది. ఆసరా పథకంలో జరుగుతున్న అవినీతి భాగోతంపై మనతెలంగాణ ప్రత్యేక కథనం.

సరిహద్దు గ్రామాలు…:అవి కర్నాటక సరిహద్దులోని తాండాలు… కర్నాటక రాష్ట్రానికి కేవలం పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి… అక్కడ మెజారిటి ప్రజలు కూడ నిరక్షారాసులే… బా హ్యప్రపంచానికి దూరంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ చాలా మంది పండుముసలి వాళ్లు, భర్తలు కోల్పోయిన వితంతువులున్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినఆసరా పథకం అండగా నిలబడింది. ప్రతి నెలా రూ.1000 చొప్పున వీరికి అందిస్తుంది. అయి తే ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని అవినీతి పరులకు కూడ ఆసరా పథకంపై ఆశ పుట్టింది.

అసలే చదువురాని నిరక్షరాస్యులు పైగా తాం డావాసులు అనుకున్నారేమో… రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెలా లబ్ధి దారులకు వెయ్యిరూపాయాలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం రెండు నెల లు, మూడు నెలలు, ఒకసారి పింఛను డబ్బులు ఇస్తున్నారు. అక్కడ కూడ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొండాపురం గ్రామంలో 180 పిం ఛను దారులున్నారు. కాని ఇక్కడ ఇచ్చేంది మాత్రం వంద మందికి మా త్రమే పంపిణీ చేస్తున్నారు. అధేవిధంగా ఇర్కిచేడు గ్రామంలో మొత్తం 230 మంది పింఛను దారులుంటే ఇక్కడ కేవలం 150మందికి మించి ఇవ్వడం లేదు. గువ్వలదిన్నె గ్రామంలో మొత్తం 270 పింఛనుదారు లుంటే ఇక్కడ కూడ దాదాపు 40 పైగా పింఛన్లు పక్కదారి పడుతు న్నాయి. ఈవ్యవహారంలో పింఛన్లు పంపిణీ చేసే పోస్టుమ్యాన్ పైనే గ్రామస్తులు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు.

ప్రతినెలా రూ.లక్షకుపైగా దోపిడి…:ఈ మూడు గ్రామాల్లో ప్రతినెలా సుమారు రూ.1లక్షకు పైగా ఆసరా పింఛను డబ్బులు పక్కదారి పడుతున్నట్లు బాధితులు వెల్లడి స్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. ఇదేమని సదరు పోస్టుమ్యాన్ అనిమేశ్వర్‌రావు ను ప్రశ్నిస్తే వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం… కొంతమంది డబ్బులు తీసుకోవటానికి రాకపోవడం వల్ల జరుగుతుంది తప్ప నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదని సమాధానం చెబుతున్నారు. మరోవైపు గువ్వలదిన్నె పంచాయతీ కార్యదర్శి గోపాల్‌నాయక్‌ని ప్రశ్నిస్తే మీరు చెబుతున్నట్లు నాగ్రామంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదు. పోస్టుమ్యాన్ మాత్రం ఇర్కిచేడులోనే ఇస్తు న్నారు. గ్రామాల్లోకి రావడం లేదు. అందుకే సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిపై పై అధికారుల కు చెప్పడం జరిగింది. వచ్చేనెలా నుంచి ఇలాంటి సమస్యలు తెలెత్తకుండా చర్యలు తీసుకుం టామంటూ సమాధానం ఇచ్చారు.

సంవత్సరం డబ్బులు ఇవ్వలేదు..: గతేడాదికి సంబంధించిన డబ్బులను ఇవ్వలేదు. ఇదేమంటే మీరు ఊర్లో లేరు కదా…? అంటూ దబాయిస్తున్నారు. అంతకు ముందు రూ.200 పింఛను కరెక్టుగా ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తుండిరి. అధికారులను గట్టిగా అడిగితే ఇపుడు మూడు నెలల నుంచి గాసం డబ్బులు ఇస్తున్నారు.
– సోనూబాయి, వితంతువు గువ్వలదిన్నెతాండ, కె.టి.దొడ్డి మండలం

వేలి ముద్రపడడంలేదంటూ….:

వేలి ముద్రలు పడడం లేదంటూ మూడు నెలల కోసారి డబ్బు లు ఇస్తున్నారు. ప్రతిసారి ఇదేమాదిరి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకో వాలి. – తెలుగుగోవిందు, కొండాపురం, కె.టి.దొడ్డి మండలం