Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

Government Offices in Rental Buildings

మన తెలంగాణ/పెద్దవంగర : మండలంలో రెవెన్యూ కార్యాలయం , పోలీస్‌స్టేషన్ , వ్యవసాయ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు నిలబడటానికి, కూర్చోడానికి ఖాళీ స్థలం లేక కార్యాలయం ముందు ఉన్న రోడ్డుకు ఇరవైపులా నిలబడుతున్నారు . అద్దె భవనాల్లో  సరైన స్థలం లేక రోడ్లపై నిలుచొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత భవనాలు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పలుమార్లు ఆధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వ్యవసాయ కార్యాలయానికి, పోలీస్‌స్టేషన్‌కి రోజు ఎంతో మంది వస్తుంటారు. కాని అక్కడ కూడా స్థలం లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అద్దె భవనాలు ఉన్నా ప్రజలు ఇబ్బందులు పడకూడదని భవనాలను మారుస్తున్న ఇబ్బందులు తప్పడం లేదు. కానీ సొంత భవనాలు లేని కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు ఆధికారులు ఎందుకు దృష్టి పెట్టడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Comments

comments