Search
Friday 16 November 2018
  • :
  • :

మళ్లీ తెరపైకి జయలలిత మృతి కేసు

jayalalitha

న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని సుప్రీం కోర్టు తీర్పు వెలువరిచిన విషయం తెలిసిందే. దీంతో సమసిపోయిందనుకున్న ఈ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. జయ మృతి చెందిన తీరు అనుమానస్పదంగా ఉందంటూ రాజ్యసభ సభ్యురాలు, అన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళా పుష్ప రాసిన లేఖపై కదలిక వచ్చింది. జయలలిత అనుమానస్పద మృతిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ శశికళా పుష్ప కేంద్ర హోంమంత్రికి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. సిబిఐకి సంబంధించిన వ్యవహారాలు చూసే సిబ్బంది వ్యవహారాల శాఖకు ఈ అంశాన్ని అప్పగించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ మణిరాం ఒక మెమొరాండం విడుదల చేశారు.

Comments

comments