Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రైతులకు హమాలీ చార్జీలు చెల్లించాలి: విపక్ష పార్టీలు

Government pay hamali charges to farmers

రామడుగు:జిల్లాలోని రైతులకు రావాల్సిన హమాలి చార్జీలు 30 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయని వాటిపై వెంటనే సిబి, సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీల నాయకులు బుధవారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. ఎకరానికి 4 వేల స్కీం పేరుతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల రైతులకు రావాల్సిన హమాలి చార్జీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో దేశాన్నే అంధకారంలోకి నెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ధర్నా మూలంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకరులను అదుపులోకి తీసుకుని ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల రమేష్, మండల అధ్యక్షుడు పులి ఆంజనేయులు, ఎంపిటీసీ సభ్యురాలు సత్యప్రసన్న, బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు రాంకిషన్, టిడిపి నేతలు సుధాకర్, అజయ్, గట్టయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments