Home జనగామ ప్రభుత్వ పనితీరు అయోమయం

ప్రభుత్వ పనితీరు అయోమయం

cong

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి :  తెరాస ప్రభుత్వం పనితీరు ప్రజలను అయోమయంలో పడేస్తుందని కాంగ్రెస్ మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలలుగా పెన్షన్లు అందక ప్రజలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్ట్రాత్మికంగా చేపట్టిన రేషన్ సరుకుల పంపిణీ సాంకేతిక పరిజ్ఞానంతో సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు  ప్రచారం.. జాస్తీ.. ప్రభు త్వం నాస్తీ అన్న తీరులో పనిచేస్తుందన్నారు. మిషన్‌కాకతీయ పనులు గ్రామలలో చేపట్టిన పైపులైన్ల నిర్మాణంలో అక్రమాలు జరిగి లీకవుతూ ప్రజలు రోగాల భారీన పడుతున్నారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు ప్రాజెక్టు పేరుతో ఎన్ని క్యూబ్‌కుల మట్టిని పూడిక తీసారే చెప్పాలన్నారు. మిషన్ కాకతీయ పథకం మిషన్ కల్వకుంట్ల పేరుగా తయారైందని ఎద్దేవ చేశారు. అంతేగాకుండా ప్రభుత్వం ప్రతిష్ట్రాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడురూము ఇండ్లను సకాంలో నిర్మంచక పోగా గత కొన్నిరోజలుగా మండలంలోని చౌడారం గ్రామంలో డబుల్‌బెడ్‌రూములు ఇండ్లు నిర్మించాలని ప్రజలు దీక్షలు చేస్తూన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తునట్లుగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఉద్యమాలు చేసిన ప్రజలపై కేసులు ఎత్తివేయక పోవడం సిగ్గుచేటన్నారు. రాబోవు రోజలలో ప్రజావ్యతిరేఖ కార్యక్రమాలు చేపడుతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు సైనికల్లాగా పనిచేస్తూ రాబోవు ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాని కూల దోయడమే ద్యేయంగా పనిచేస్తూ ప్రజలను అవగాహణ పరుచాలని పిలుపు నిచ్చారు.
వివిద పార్టీల నుండి పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో
వందలాది మంది చేరిక..
మాజీ టిపీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్, మాజీ మంత్రి గుండె విజయరామారావుల ఆధ్వర్యంలో ఖిలాషాపురంగ్రామానికి చెందిన వివిద పార్టీల నుండి వందలాది మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వివిద గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.