Home జిల్లాలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి

medaచేగుంట : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐకేపీల ఆద్వర్యంలో కోపుగోలు కేంద్రాలను ఎర్పాటు చేస్తున్నట్లు యంపీపీ తెలిపారు. మంగళవారం రోజున మండల పరిదిలోని గోవిందాపూర్, నార్సింగి, వడియారం గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా ఐకేపీ ఆద్వర్యంలో ఎర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను యంపీపీ అల్లిరమ ప్రారంబించారు.ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ రైతులు పండించిన కొద్దిపాటి దాన్యాన్ని మద్య దళిరీలతో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలోనే ఆమ్మాలని యంపీపీ తెలిపారు.రైతులకు దాన్యం మద్దతు దర 1450 రూపాయలకు(ఎ-గ్రేడ్) కామన్ 1410రూపాయలు దర ఉందని రైతు దాన్యం అమ్మిన 78 గంటలలోపే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మల పాల్గోని దాన్యం కోనుగోలు అన్‌లైన్ విదానాన్ని పరిశీ లించారు. సీసీ శంకర్ అన్‌లైన్ విదానం ఎవిదంగా ఉంటుందో ట్యాఫ్ ద్వారా చూపించారు. ఒక రైతుకు ఎకరాకు కనీసం ఎంత సరుకు వస్తుందో అంతే కోనగోలు చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఉంటే అన్‌లైన్ తీసుకోదని తెలిపారు. ఈ విదంగా మోసం అనేది జరగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరియా కోఆర్డీనేటర్ మదుసూదన్, ఎపీయం లక్ష్మినర్సమ్మ, అధ్యక్షురాలు లక్ష్మి, సీసీ సుల్తాన, సిసి బాల్‌రాజ్ , ఆయా గ్రామాల సర్పంచ్‌లు,యంపీటీసీలు, మహిళా సంఘాల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.