Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పంతం నెగ్గించుకున్నారు సరే.. పనిమాటేమిటి?

Teachers-Rajapur

రాజాపూర్‌ : గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అంగన్‌వాడీలు చాలి చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోంటున్నామంటూ.. గతంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి మా సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం స్పందించి వారి జీతాల ను పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్ వాడీలు ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విధులు నిర్వహించాల్సి ఉండగా ఇదివరకు ఉన్నటువంటి జీతాలు సరిపోక పోవడంతో వారు ప్రతామ్నాయ మార్గా లు అన్వేషిస్తూ కుటుంబ పోషపై దృష్టి సారించే వారు. అయితే ప్రస్తుతం వారి కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేసింది. ఇది వరకు గ్రామాల్లో ఉండే అంగన్‌వాడి సెంటర్‌లో అధికారులు తనిఖీలు చేసిన సందర్బాల్లో రికా ర్డులు పరిశీలించడం, సమయానికి వస్తున్నారా లేదా..? అంగన్ వాడి సెంటర్‌కు వచ్చే మహిళలను అడిగి తెలుసు కునేవారు.. కానీ చిన్నారుల విద్యాభివృద్దికి ఏమైనా కృషి చేస్తున్నారా లేదా అనే విషయాలు ఇదివరకు పట్టించు కున్నా దాఖలాలు కనిపించలేదు.. అయితే ప్రస్తుతం పూర్తి సమయాన్ని కేటాయించి అంగన్‌వాడి టీచర్లు చిన్నారుల కు విద్యాబుద్దులు నేర్పించి వారి నైపుణ్యాబివృద్దికి కృషి చేయాల్సిన భాద్యత కూడా వారిపైనే ఉందని పలువురు పేర్కోంటున్నారు. ఇదివరకు కొన్ని అంగన్‌వాడి సెంటర్లు సమయ పాలన పాటించక పోవడం, అధికారులు వస్తున్నారంటేనే అంగన్‌వాడీ సెంటర్లు తెరువడం, రికా ర్డులు సరిగ్గా చూయించక పోవడం వంటి సమస్యల తో అధికారులతో చివాట్లు తిన్న సందర్బాలు కూడా ఉన్నా యి. పల్లె వికాసంలో అధికారుల తనిఖీల్లో కొన్ని అంగన్ వాడి సెంటర్లో పనిచేసే వారికి అధికారులు తీరు మార్చు కోవాలని హెచ్చరికలు కూడా జారి చేసిన సందర్బాలు ఉన్నాయి.. గతంలాగానే పరిస్థితి ఉండకుండా అంగన్ వాడీలు పనికి తగిన వేతనం పొందడంతో పాటు భాద్యత యుతంగా పనిచేయాల్సిన భాద్యత కూడా వారిపై ఉందని ప్రజలు పేర్కోంటున్నారు. అదే విధంగా అంగన్ వాడీల పరిస్థితి ఇదివరకు ఉన్నట్లుగానే కాకుండా అధికారులు దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవా ల్సిన అవసరం కూడా వారిపై ఉందని ప్రజలు పేర్కోంటు న్నారు. ఏది ఏమైనా పనికి తగిన వేతనాల కోసం పోరాటం చేసి సాధించుకున్నారు.అదే విధంగా గత రెండేళ్ళనుండి అంగన్‌వాడి సెంటర్లలో పనిచేస్తున్న టీచర్లకు, ఆయాలకు, అద్దె సెంటర్లకు బిల్లులు చెల్లించక పోవడంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవ సరం కూడా ఉందని పలువురు అంగన్‌వాడీలు పేర్కొం టున్నారు.

Comments

comments