Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి

Joguraman-image

విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో
జిల్లా అధికారులకు ఎంపి గోడం నగేష్ ఆదేశం

మన తెలంగాణ/ ఆదిలాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలో అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్(దిశ) సమావేశం పార్లమెంటు సభ్యుని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫస ల్ భీమా యోజన, ప్రధాన మంత్రి కృషి యోజన, భూ సార పరీక్ష కార్డులు, ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, జననీ సురక్ష యోజన, అమృత్ కార్యక్రమాలు, అంగన్‌వాడీల పనితీరు, గ్రామ స్వరాజ్ అభియాన్ కింద విద్యుత్ కనెక్షన్లు, దీన్ దయా ల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ప్రధాన మంత్రి ఉపాధి అవకాశాల కల్పన, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ, ఉజ్వల, డిజిటల్ ఇండియా, సంసద్ ఆదర్శ గ్రామ యోజన, స్వచ్చ భారత్, జాతీయ రహదారులు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వసూలు చేసిన ప్రీమియం చెల్లించిన వారి దరఖాస్తులను రైతుల వారీగా వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అన్నారు. సర్వశిక్ష అభియాన్ కింద నిర్మించే భవనాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జననీ సురక్ష యోజన పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల భర్తీని త్వరలో పూర్తి చేయాలని అన్నారు. ప్రజలకు మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ప్రజలకు తాగునీరు ఇంటింటికి అందించాలన్నారు. ఉజ్వల పథకం కింద అర్హులైన వారికి గ్యాస్ సిలెండర్లను పంపీణీ పూర్తి చేయాలని తెలిపారు. ఈజిఎస్ కూలీలకు కూలీలు, పించన్ దారులకు పించన్లు సక్రమంగా పంపిణీ చేయాలని అన్నారు. మిషన్ కాకతీయ పనులు, చెవువు ప్రాంతంలో  సుందరంగా ఉండేలా ప్రణాళికలు రూపోందించాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే మెటీరియల్ సక్రమంగా లేదని, పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల నియామకాలు పూర్తి చేయాలని అన్నారు. పట్టణంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పనులు ఇంట్రావిలేజి పనులు తొందరగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లా యంత్రాంగానికి లాగిన్ ఐడి ఇవ్వడం ద్వారా రైతులకు సత్వరమే సహకారం అందించవచ్చని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ కింద 12 శాతం జిఎస్‌టిలో 7 శాతం రైతు, 5 శాతం ప్రభుత్వం చె ల్లించాల్సి ఉందని, పేద ఎస్సీ, ఎస్టీ, ఎస్టీలు 7 శాతం కూడ చెల్లించాలని సూచించారు. అంగన్ వాడీ కార్యకర్తల ఖాళీలను నిబంధనల మే రకు వారం రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపారు. మురుగుదొడ్ల నిర్మాణాలలో పేద ప్రజలకు రివాల్వింగ్ ఫండ్ కింద నగదు చెల్లించాలని మంచిర్యాల జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ ఎక్కువగా ఉందని, అట్టి ఫం డ్ పాత జల్లా కేంద్రం కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. చెరువులున్న ప్రాంతాల్లో సుందరీకరణకు జాతీయ ఉపాధి హామి పథకం నిధుల ద్వారా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్‌మనీషా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

comments