Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కొంప ముంచిన సిసి కెమెరాలు..!

cc-camer

 * పదిలో తేటతెల్లం అయిన ఫలితాలు

రాజోళిః  హైకోర్టు ఆదేశాలతో జిల్లాలో ప్రయోగత్మాకంగా సిసి కెమెరాలను ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వచ్చిన ఫలితాలతో సిసి కెమెరాల వల్ల ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు. రాజోళి మండలం కేంద్రమై జిల్లా పరిషత్ పది పరీక్షా కేంద్రలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల నడుమ మొట్ట మొదటి సారిగా విద్యార్థులు తమ భవిష్యతును పరిక్షీంచుకోవడంతో ఈ ఏడాది ఫలితాలు ఉపాధ్యాయులు చెప్పిన చదువులను తేటతెల్లం చేశాయి. ఈ ఏడాది మాస్ కాపీయింగ్ అవకాశం లేకపోవడంతో విదార్థుల్లో ఉన్నటువంటి అసలైన విద్యాప్రమాణాలు భయపడ్డాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు 90శాతం తగ్గని ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది కేవలం 30శాతం పడిపోవడంతో సర్కార్ బడుల్లో చదువులు అటకెక్కయానడానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ కేంద్రంగా మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం 43 మంది ఉత్తీర్ణత సాధించారు. సిసి కెమెరాల మధ్య వ్రాసిన ఫలితాలతో ఖంగు తిన్న విద్యాశాఖ అధికారులు వచ్చే ఏడాది ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

* ప్రత్యేక తరగతులు నిర్వహించాలిః విద్యార్థుల తల్లిదండ్రులు
అనుఉత్తీర్ణులైన విద్యార్థులను సప్లమెంటరీ సమయానికి సబ్జెక్ట్ వైజ్‌గా గట్టెంక్కించక పోతే మిడిల్ డ్రాప్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది గ్రామంలో పెద్ద ఎత్తున అనుఉత్తీర్ణులు కావడంతో సప్లమెంటరీలో ఉత్తీర్ణుతను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments