Home రాష్ట్ర వార్తలు అన్నదాత ఆగ్రహించకముందే ప్రభుత్వం మేల్కోవాలి : రేవంత్

అన్నదాత ఆగ్రహించకముందే ప్రభుత్వం మేల్కోవాలి : రేవంత్

Revanth-Reddy

హైదరాబాద్ : రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆయన లేఖ రాశారు. అన్నదాతలు ఆగ్రహించక ముందే ప్రభుత్వం మేల్కోవాలని ఆయన అన్నారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగక తప్పదని హెచ్చరించారు. రైతులకు మేలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రైతుల రుణ మాఫీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నారు. రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమా చేయాలని అన్నారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని.. సబ్సిడీ విత్తనాలు సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.