Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విద్యారంగ సమస్యల పరిష్కారించాలి: ఎబివిపి

Government Solution to education issues in Rangareddy

కడ్తాల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎబివిపి రాజీలేని పోరాటం చేస్తుందని, ఎబివిపి ఉద్యమాలతోనే అనేక విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యాయని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనాదుల మహేష్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో సోమవారం ఎబివిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ఎబివిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం దోనాదుల మహేష్ మాట్లాడుతూ ఎబివిపి 70 వసంతాలు పూర్తి చేసుకుందని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంచుతూ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్న ఘనత ఎబివిపిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా ఎబివిపి కీలక పాత్ర పోషించిదని తెలిపారు. జాతీయ భావాలను పెంచుతూ విదేశీ ద్రొహులను తరిమి కొడుతున్న ఎబివిపికి విద్యార్థుల్లో అపూర్వ స్పందన లభిస్తుందని, లక్షల సంఖ్యలో విద్యార్థులు ఎబివిపిలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి భాగ్ కన్వీనర్ భగీరథ్, హరికృష్ణ, జగయ్య, మురళి, శ్రీహరి, రమేష్, నరేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments