Home సంగారెడ్డి త్వరలో ఇంటికో బర్రె పథకం ప్రారంభం

త్వరలో ఇంటికో బర్రె పథకం ప్రారంభం

Government Sponsored Subsidy Schemes

జోగిపేట: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డీ,బీ.నాగభూషణం సూచించారు. జోగిపేట పట్టణంలోని గొర్రెల పెంపకం దారులకు సంబంధించిన గొర్రెల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచితంగా దాణాను సరఫరా చేసింది. ఈ దాణా బస్తాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జోగిపేట పశు వైద్యశాల వద్ద చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించి లబ్ది దారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇంటికో బర్రె పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టేందుకు సన్నదమవుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గొర్రెల పెంపకం దారులకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ కే దక్కుతుందన్నారు. అలాగే గొర్రెకాపరులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా దాణాను అందజేయడం, వ్యవసాయానికి పెట్టుబడి సాయం, రైతు బీమా పథకం లాంటి ప్రభుత్వ సేవలు మారువలేనివని చెప్పారు.  ఈ కార్యక్రమంలో పశు వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ, గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ నవాబుగారి భూమయ్య యాదవ్, మండల పశువైద్యాధికారి డాక్టర్ సాకెత్, సిబ్బంది పాల్గొన్నారు.