Home బిజినెస్ బిఎస్‌ఎన్‌ఎల్‌కు 1526 కోట్ల ఆదాయం

బిఎస్‌ఎన్‌ఎల్‌కు 1526 కోట్ల ఆదాయం

  • రూ. 400 కోట్లతో ఆధునీకరణ పథకాలు : సిజిఎం అనంతరామ్

BSNL-Profits

హైదరాబాద్ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రూ. 400 కోట్లతో ఆధునీకరణ పథకాలను అమలు పర్చాలని సంకల్పించామని తెలంగాణ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్. అనంతరామ్ తెలిపారు. 2016 -17 సంవత్సరానికి తమ సంస్థ ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో పాటు తాజాగా తీసుకువచ్చిన, తీసుకురానున్న ప్లాన్‌లు, సేవల గురించి ఆయన మంగళవా రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2016-17లో సంస్థ మొత్తం 155 వై-ఫై హాట్ స్పాట్‌లను ఆరంభించిం దని, తాజాగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఆసుప త్రులు,షాపింగ్ కాంప్లెక్స్‌ల వంటి బహిరంగ ప్రదేశాలలో వై ఫైని అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నామన్నారు. ఇందుకోసం అదనంగా 1150 టవర్లను నిర్మించే యోచన ఉందన్నారు. 2016-17లో బిఎస్‌ఎన్‌ఎల్ ఉమ్మడి ఏపి సర్కిల్ రూ. 1526.18 కోట్ల మొత్తం ఆదాయాన్ని సాధిం చిందని అనంతరామ్ చెప్పారు. ఇదే కాలానికి మ్బైల్ విభాగంలో బిఎస్‌ఎన్‌ఎల్ ఎపి, తెలంగాణ సర్కిల్ విభా గంలో రూ. 1475.86 కోట్ల ఆదాయాన్ని సాధించింద న్నారు. సంస్థ పథకాలు, ప్లాన్‌లు ఈ విధంగా ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సంయుక్త సర్కిల్ మొత్తం 1,70,121 ల్యాండ్ లైన్ కనెక్ష న్‌లను సాధించగలింది. ఇది అంతక్రితం సంవత్సరంతో పోల్చి చూస్తే 6.86 శాతం అధికం. అంతే కాకుండా గత నాలుగు సంవత్సరాలలో చూసినప్పుడు ఇది అత్యంత అధిక స్థాయి కూడా అని గుర్తు చేశారు. బ్రాండ్ బ్యాండ్ పరంగా చూస్తే 1,31,154 కనెక్షన్‌లను నమోదు చేసినట్లు తెలిపింది. ఫైబర్ టు ద హోం (ఎఫ్‌టిటిహెచ్) విభాగంలో 9407 కనెక్షన్‌లను సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్స రం కన్నా 52.24 శాతం అధికం. కాగా బిఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కొత్త పథకం “ లిమిటెడ్ ఫిక్స్‌డ్ మొబైల్ టెలిఫో నీ” పేరుతో ప్రవేశ పెట్టింది. ల్యాండ్ లైన్ వినియోగదా రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్కీమ్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది మొబైల్ టు మొబైల్ మాత్రమే ఉండేది. బ్రాడ్ బ్యాండ్ కాంబో ప్లాన్‌లలో భాగంగా ఏ నెట్ వర్క్‌కు అయినా 24 గంటల అపరిమిత కాలింగ్‌ను అందించే యాడ్ ఆన్ వాయిస్ ప్యాక్స్‌ను కూడా తీసుకు వచ్చింది. హైదరాబాద్ మెట్రో కారిడార్ వెంబడి బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు నిరంతరాయంగా 3 జి సేవలను అందుకునేందుకు గాను 2జి, 3జి సైట్‌లు అరువైనాలుగింటిని ఏర్పాటు చేయాలని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రతిపాదించింది. ఇప్పటికే నాగోల్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించామని, దశల వారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని అనంతరామ్ తెలిపారు.